30, ఆగస్టు 2015, ఆదివారం
28, ఆగస్టు 2015, శుక్రవారం
ఒక రోజు బస్ లో...
బస్ లో నా పక్కన కూర్చుందో ముద్దులు మూట కట్టే చిన్నారి..మూడేళ్ళుంటాయేమో.ఆగలేక మెల్లిగ బుగ్గను తాకాను."నీ పేరేమిటమ్మా" అని అడిగా..ఒక నిమిషం అలాగే చూసి "నీకెందుకూ" అంది.చిన్నారులకు ఉగ్గు పాలతోనే అపనమ్మకం రంగరించి పోయడం నేటి సమాజం లో అవసరం గా మారిపోయింది.కలికాలమా..ఇది నీ మహిమా..??
లేబుళ్లు:
ఒక మాట..
27, ఆగస్టు 2015, గురువారం
2012 ప్రపంచ తెలుగు మహా సభలు లో బాలసాహిత్య పురస్కారం.
లేబుళ్లు:
నా సాహితీ పురోగతి.,
పురస్కారాలు,
బాల సాహిత్యం
26, ఆగస్టు 2015, బుధవారం
ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు-2015 లో నేను..
ప్రపంచ తెలుగు రచయితల మహా సభలు-2015- విజయవాడ లో నేను పాల్గొనడం..పలువురు రచయితలను కలవడం..కొందరు నా పేరు ను గుర్తించడం..తనికెళ్ళ భరణి గారు ,గొల్లపూడి మారుతీ రావు గారు,సుద్దాల అశోక్ తేజ వంటి వారి తో మాట్లాడడం ఫొటోస్ దిగడం,సినీ గేయ రచయిత వనమాలి గారి తో 15 నిమిషాల సంభాషణ,వెంకయ్య నాయుడు గారు,బ్రహ్మానందం గార్ల శక్తివంతమైన ఉపన్యాసాలు,చక్కని జ్ఞాపకాలతో ఒక 2 ఆహ్లాదమైన రోజులు..నా జీవితం లో ..
లేబుళ్లు:
ఒక మాట..,
నా సాహితీ పురోగతి.,
పురస్కారాలు
24, ఆగస్టు 2015, సోమవారం
ప్రముఖ రచయిత ద్వా.నా.శాస్త్రి గారి అలనాటి విశేష కవితలు పుస్తకాన్ని నిన్న(23/8/2015) నేను సమీక్షించాను..ఆ వివరాలు :
ప్రముఖ రచయిత ద్వా.నా.శాస్త్రి గారి అలనాటి విశేష కవితలు పుస్తకాన్ని నిన్న నేను సమీక్షించాను..భావతరంగిణి 17వ వార్షికోత్సవం 2వ రోజు ద్వా.నా.శాస్త్రి గారు సంకలనం చేసిన అలనాటి విశేష కవితలు పుస్తకం అంకిత సభ జరిగింది.1972 నుండి కొన్ని వందల పుస్తకాలు సమీక్ష చేసిన ద్వా.నా.శాస్త్రి గారి పుస్తకం నేను సమీక్ష చేయదం..అందరి మెప్పు పొందడం నాకు ఒక చక్కని అనుభూతి గా మిగిలింది.
లేబుళ్లు:
నా సాహితీ పురోగతి.,
పత్రిక లో నేను.
23, ఆగస్టు 2015, ఆదివారం
ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 31వ కథ."మొసలి మనసు తెలిసిందా కోతి బావా?"
లేబుళ్లు:
31,
ఈనాడు హాయ్ బుజ్జీ,
కథ,
పిల్లల కథ,
బాల సాహిత్యం
21, ఆగస్టు 2015, శుక్రవారం
బహుమతి వచ్చిందోచ్..
లేబుళ్లు:
పురస్కారాలు,
వ్యాసం
19, ఆగస్టు 2015, బుధవారం
ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 28వ పిల్లల కథ..."జిరాఫీ జపం"..18/11/2013
లేబుళ్లు:
28,
ఈనాడు హాయ్ బుజ్జీ,
కథ,
పిల్లల కథ,
బాల సాహిత్యం
17, ఆగస్టు 2015, సోమవారం
నా సాహితీ పురోగతి.
భావ తరంగిణి పత్రిక 17వ వార్షికోత్సవ వేడుకలలో భాగం గా కళాశాలల విద్యార్ధులకు క్విజ్ పోటీ లు ఈ రోజు 2-5.30 జరిగాయి.నేను క్విజ్ మాస్టెర్ గా ప్రశ్నలు అడిగాను.భవిష్య గారు చక్కగా రూపకల్పన చేసిన ఆ కార్యక్రమం లో పాలు పంచుకోవడం నాకు ఆనందాన్నిచ్చింది.11 టీంస్,12 రౌండ్స్,సరైన జవాబు కి 2 మార్క్స్,తప్పు సమాధానానికి -1/2,2 ఫోన్ ఎ ఫ్రెండ్ అవకాశాలు..నాకు చాలా నచ్చింది.పైగా భవిష్య గారు ప్రకటించిన బహుమతులే కాక సిలార్ గారు,గుత్తికొండ సుబ్బారావు గారు కూడా పాల్గొన్న పిల్లలందరికీ బహుమతులు ప్రకటించారు..22వ తేదీన సాయంత్రం జరిగే వార్షికోత్సవ వేడుకలలో బహుమతి ప్రదానం జరుగుతుంది.
లేబుళ్లు:
నా సాహితీ పురోగతి.
ఉగాది కవిసమ్మేళనం.
లేబుళ్లు:
కవిత,
పురస్కారాలు,
బాల సాహిత్యం
16, ఆగస్టు 2015, ఆదివారం
ఒక మాట..నా మొదటి సమీక్ష.
2014 లో వడలి రాధాక్రిష్ణ గారి "వడలి రాధాక్రిష్ణ కథలు" పుస్తక ఆవిష్కరణ మచిలీపట్నం లో జరిగింది. ఆ పుస్తక ఆవిష్కరణ నేను చేశాను. "కథలు 2 రకాలు..కొన్ని కాడ్బరీడైరీమిల్క్ లా నోట్లో వేసుకోగానే కరిగిపోతాయి.కొన్ని పిప్పరమెంటు బిళ్ళ లాంటి ఘాటు తో సమాజం పట్ల పాటకుల బాధ్యతని గుర్తు చేసే విధంగా సాగుతాయి.ఈ పుస్తకం లోని కథలు రెండో కోవకి చెందినవి..." అలా ప్రారంభమైన నా సమీక్ష అందరి ప్రశంసలు పొంది నాకో మంచి జ్ఞాపకం గా మిగిలింది.
14, ఆగస్టు 2015, శుక్రవారం
ఒక మాట..
ఆగస్ట్ నెలలో ఒక బాల కార్మికురాలిని పట్టుకుని మా బళ్ళో చేర్చి వెళ్ళారు అధికారులు.6 వ తరగతిలో..మర్నాడే సైన్సు పరీక్ష..భారము అనగానేమి? ఆ ప్రశ్న పత్రం లో ఒక ప్రశ్న..అక్షర దోషాలతో కూడబలుక్కుంటూ ఆ పాప రాసిన జవాబు: "నేను పుట్టి మా అమ్మ,నాన్న కు భారం అయ్యానుట" .. మా అందరి గుండెలు భారం చేసింది ఆ జవాబు..ఎక్కడో కలుక్కుమంది.3 రోజుల ముచ్చటగా తను మళ్ళీ బడి ప్రపంచం నుండి మాయమయ్యింది.కానీ ఈ విషయం నా మనసు పొరల్లో వదిలి వెళ్ళింది. 
లేబుళ్లు:
ఒక మాట..,
బాల సాహిత్యం
13, ఆగస్టు 2015, గురువారం
ఈనాడు హాయ్ బుజ్జీ లో నా పజిల్.
లేబుళ్లు:
ఈనాడు హాయ్ బుజ్జీ,
పజిల్,
బాల సాహిత్యం
12, ఆగస్టు 2015, బుధవారం
ఒక మాట..కథ చెప్పానోచ్.
ఆదివారం(9/8/2015)న మా ఊరు మచిలీపట్నం(బందరు) టౌను హాలు లో బందరు బంధువులు(ఫేస్ బుక్ గ్రూప్)2 వ ఆత్మీయ సమావేశం జరిగింది..నేను 3 కథలు చెప్పాను. 4 రాష్ట్రాల నుండి వచ్చిన 300 మంది ఇష్టంగా విన్నారు.మొదటి కథ : "కుదురు లేని కుంకుడు గింజ" ని ముచ్చటగా,రెండవ కథ :"పిసినారి బావ" ని హాస్యాన్ని,నీతిని ఆస్వాదిస్తూ వినగా 3వ కథ :"అమ్మ ఫొటొ" కంటతడి పెట్టించిందని ప్రశంసించారు. హావభావాలతో చాలా బాగా చెప్పానని మెప్పు పొందడం నాకు ఆనందం. ఇలా నాతోకథ చెప్పించాలనే ఆలోచన చేసిన కాంత్.జొన్నలగడ్డ గారికి ధన్యవాదాలు.
లేబుళ్లు:
ఒక మాట..,
బాల సాహిత్యం
11, ఆగస్టు 2015, మంగళవారం
ఈనాడూ హాయ్ బుజ్జీ లో నా పజిల్
లేబుళ్లు:
ఈనాడు హాయ్ బుజ్జీ,
పజిల్,
బాల సాహిత్యం
10, ఆగస్టు 2015, సోమవారం
ఈనాడు హాయ్ బుజ్జీ లో నా పజిల్
లేబుళ్లు:
ఈనాడు హాయ్ బుజ్జీ,
పజిల్,
బాల సాహిత్యం
సత్యశ్రీ సాహితీ పురస్కారం..
లేబుళ్లు:
పురస్కారాలు,
బాల సాహిత్యం
7, ఆగస్టు 2015, శుక్రవారం
ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 33వ పిల్లల కథ.."యుద్దాన్ని ఆపిన తెల్లపావురం"..26/3/2014
లేబుళ్లు:
33,
ఈనాడు హాయ్ బుజ్జీ,
కథ,
పిల్లల కథ,
బాల సాహిత్యం
6, ఆగస్టు 2015, గురువారం
ఈనాడు హాయ్ బుజ్జీ..నా పజిల్.
లేబుళ్లు:
ఈనాడు హాయ్ బుజ్జీ,
పజిల్,
బాల సాహిత్యం
5, ఆగస్టు 2015, బుధవారం
పజిల్..ఈనాడు హాయ్ బుజ్జీ
లేబుళ్లు:
ఈనాడు హాయ్ బుజ్జీ,
పజిల్,
బాల సాహిత్యం
4, ఆగస్టు 2015, మంగళవారం
ఈనాడు హాయ్ బుజ్జీ..పజిల్
లేబుళ్లు:
ఈనాడు హాయ్ బుజ్జీ,
పజిల్,
బాల సాహిత్యం
3, ఆగస్టు 2015, సోమవారం
రాళ్ళబండి కవితాప్రసాద్ కు కవితాంజలి.
కంప్యూటర్ యుగం కాదిది రాతి యుగమే.."రాళ్ళ"బండి యుగమే.
మీ పేరు లోనే కవి ని,తావి ని ఇముడ్చుకున్నారు
దోసిట్లో భూమండలం మీ "కవితా ప్రసాదం"
సాహిత్యం తోనే మీ సాన్నిహిత్యం
అక్షరాలతో అవలీలగా అవధానాటలాడుతుంటే
60 నిమిషాల్లో 360 పద్యాలు,
25 నిమిషాల్లో అవధానం పూర్తి
లాంటి వింతలతో కొత్త పుంతలతో
కొంగ్రొత్త ప్రక్రియలు స్రుష్టిస్తుంటే
ఒప్పుకోవాలి..తప్పు మాదేలే.
మా అబ్బురపు సెగ అంబరాన్నంటి
మా చప్పట్ల తప్పెట్ల మోతకి
దేవతలు అదిరి చెదిరి
శచీపతి నిద్దుర వదిలి కదిలి
ఏమా అవధాన ప్రక్రియా వైవిధ్యం!
చూడాల్సిందేనని కుతూహలపడి
అర్ధంతరంగా మిము ఆహ్వానిస్తే.. కాదనలేక
కలగంటున్న లక్ష పద్యార్చన పక్కకు పెట్టి
రాళ్ళ బాట లోని తెలుగు బండి ని నల్లేరు పై నడపాలనే
మీ ఆశయాన్ని ఆశగా మా శ్వాస లో నింపి
ఒంటరి పూలబుట్ట లా మమ్మిలనొదిలి
కోటికొమ్మల చెట్టు లా మీరిలనొదిలి...
మౌనంగా నిష్క్రమించారు.
మూగబోయింది నూరు తీగల వీణయే కాదు....మెం కూడా.
అయితేనేం..
ప్రతి సాహితీ సభ దీపశిఖ రెపరెప లోనూ
మీ ఊపిరి మాకు కనబడుతుంది.
మా రచనలతో తెలుగుని వెలిగిస్తున్నపుడు
చప్పట్ల ధ్వని లో మీ గుండె చప్పుడు మాకు వినబడుతుంది..
మీ పేరు లోనే కవి ని,తావి ని ఇముడ్చుకున్నారు
దోసిట్లో భూమండలం మీ "కవితా ప్రసాదం"
సాహిత్యం తోనే మీ సాన్నిహిత్యం
అక్షరాలతో అవలీలగా అవధానాటలాడుతుంటే
60 నిమిషాల్లో 360 పద్యాలు,
25 నిమిషాల్లో అవధానం పూర్తి
లాంటి వింతలతో కొత్త పుంతలతో
కొంగ్రొత్త ప్రక్రియలు స్రుష్టిస్తుంటే
ఒప్పుకోవాలి..తప్పు మాదేలే.
మా అబ్బురపు సెగ అంబరాన్నంటి
మా చప్పట్ల తప్పెట్ల మోతకి
దేవతలు అదిరి చెదిరి
శచీపతి నిద్దుర వదిలి కదిలి
ఏమా అవధాన ప్రక్రియా వైవిధ్యం!
చూడాల్సిందేనని కుతూహలపడి
అర్ధంతరంగా మిము ఆహ్వానిస్తే.. కాదనలేక
కలగంటున్న లక్ష పద్యార్చన పక్కకు పెట్టి
రాళ్ళ బాట లోని తెలుగు బండి ని నల్లేరు పై నడపాలనే
మీ ఆశయాన్ని ఆశగా మా శ్వాస లో నింపి
ఒంటరి పూలబుట్ట లా మమ్మిలనొదిలి
కోటికొమ్మల చెట్టు లా మీరిలనొదిలి...
మౌనంగా నిష్క్రమించారు.
మూగబోయింది నూరు తీగల వీణయే కాదు....మెం కూడా.
అయితేనేం..
ప్రతి సాహితీ సభ దీపశిఖ రెపరెప లోనూ
మీ ఊపిరి మాకు కనబడుతుంది.
మా రచనలతో తెలుగుని వెలిగిస్తున్నపుడు
చప్పట్ల ధ్వని లో మీ గుండె చప్పుడు మాకు వినబడుతుంది..
2, ఆగస్టు 2015, ఆదివారం
పజిల్..ఈనాడు హాయ్ బుజ్జీ
లేబుళ్లు:
ఈనాడు హాయ్ బుజ్జీ,
పజిల్,
బాల సాహిత్యం
ఒక మాట..
వారం రోజులు మద్రాస్ లో గడిపి అర్ధరాత్రి కి ఇంటికి చేరాను.నేను మిస్ అయింది ఇంటినే కాదు..బ్లాగ్ ని కూడా అనిపించింది.
"కరిగిపోయే కాలాన్ని చూసి గంటకో సారి గగ్గోలు పెడుతోంది..గోడగడియారం.."
"కరిగిపోయే కాలాన్ని చూసి గంటకో సారి గగ్గోలు పెడుతోంది..గోడగడియారం.."
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)