25, నవంబర్ 2015, బుధవారం

ఒక మాట...

గ్రంధాలయ వారోత్సవాలలో భాగంగా నవంబర్ 19న మహిళాదినోత్సవం జరిగింది.ఆ సభకు నేను అధ్యక్షత వహించాను.ఇందిరాగాంధీ జయంతి ని పురస్కరించుకుని కె.వై.ఎల్.ఎన్.కళాసాగర్ పక్షాన తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య  నిర్వహణ లో జరిగిన సభ ఇది.

17, నవంబర్ 2015, మంగళవారం

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 21వ పిల్లల కథ"గడ్డిపూవు-మల్లెమొగ్గ".

ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 21వ పిల్లల కథ"గడ్డిపూవు-మల్లెమొగ్గ"..16/5/2013 న ప్రచురితం..పెంపకం అంశం తో కథ రాయాలనిపించి రాసిన కథ..

11, నవంబర్ 2015, బుధవారం

...................

మా బడిలో 10వ తరగతి చదివే నాగరాజు అనే పిల్లవాడు నరకచతుర్దశి రోజు (నిన్న) చనిపోయాడు.కామెర్లు తిరగబెట్టాయి..పథ్యం సరిగా చెయ్యలేదు అన్నారు.."తులసితీర్ధం నాటిక వేయించా అతను 8వ తరగతి లో ఉండగా.ముగ్గురే పాత్రధారులు.అద్భుతమైన హాస్యం, నీతి గల నాటిక.దినేష్,ఖాదర్ లు భార్యాభర్తలుగా అద్భుతంగా నటించగా "నాగరాజు" పాలేరు నారాయణ  పాత్రలో అత్యద్భుతంగా నటించాడు..45నిమిషాలకు కుదించిన ఆ నాటిక లో సంభాషణలను అలవోకగా నేర్చుకుని తన ధారణతో నన్ను,నటనతో అందరినీ నివ్వెరబోయేలా చేసిన ఈ బాలుడి జీవిత పాత్ర అప్పుడే ముగింపుకు రావడం నాకు........నారాయణా అనగానే ఏంటండీ అని నవ్వుతూ దగ్గరకు వచ్చే నాగరాజు ..అతడి చిట్టిపొట్టి రూపం..నేను ఎప్పటికీ మరువలేను.