12, డిసెంబర్ 2016, సోమవారం

a memory..

అక్క పెళ్ళి కుదిరింది.నేను ఇంటర్లో ఉన్నా.గుడివాడలో మా ఇంటికి అతి సమీపంలో (నడక దూరంలో అన్నమాట) టి.టి.డి.కళ్యాణ మండపం కట్టిన కొత్తలు అవి.అప్పటికి అందులో రెండు పెళ్ళిళ్ళే అయ్యాయి.అంత కొత్త అన్నమాట.పోన్లే ఆడపిల్లలు పెళ్ళీడు కి వచ్చేసరికి ఇంటి దగ్గర్లో కళ్యాణ మండపం అమరింది అని అమ్మ మురిసిపోయేది.పెళ్ళి ముహూర్తం ఖరారు చేసినట్లుగా కబురు తెలిసింది.నాన్న భోజనం చేస్తున్నారు.పెరుగు అన్నం కలుపుకుంటుండగా అమ్మ ఉత్తరంతో వచ్చి పెళ్ళి తేదీ ఖరారు అయినట్లుగా చెప్పింది. వెంటనే నాన్న లేచి చెయ్యి కడిగేసుకుంటూ..నన్ను చొక్కా తెమ్మని పిలుస్తూ..లుంగీతోనే బయలుదేరేస్తూ..చెప్పులేసుకుంటూ..అమ్మ "అదేమిటండీ!తినే కంచం ముందు నుండి లేచారు.ఆ రెండు ముద్దలు తిని వెళ్తేనేం" అంటున్నా వినిపించుకోకుండా.
నేను చొక్కా అందించి.. వేసుకుంటూ గేటు దాటుతున్న నాన్న వెనకాలే వెళ్ళాను అక్క పెళ్ళి సంబరంతో.
నాన్న వేగంగా వెళ్ళి మేనేజర్తో తేదీ చెప్పి నా చేత్తో అడ్వాన్స్ ఇప్పిస్తుండగా హడావిడిగా మరో వ్యక్తి ప్రవేశించారు.మేము అడిగిన తేదీనే ఆయన అడిగి బుక్ అయిపోయిందని విని హతాశుడై నిలుచుండిపోయారు కాసేపు.
నోరు తెరిచి చూస్తున్న నేను నాన్న భుజం పై చెయ్యి వేసి "వెళ్దామా అమ్మా!" అనేసరికి తేరుకున్నాను.
**" సమయం ఎంత విలువైందో నేను ప్రత్యక్షంగా తెలుసుకున్న సందర్భం అది."**
ఇంటికొచ్చాక విషయం తెలుసుకుని అమ్మ కూడా ఆనందించడం,ఆ కళ్యాణ మండపం లో జరిగిన మూడో పెళ్ళిగా మా అక్క పెళ్ళి మామూలే అనుకోండి.
కానీ ఈ సంఘటన నాన్న నుండి నేను నేర్చుకున్న అతి విలువైన పాఠాలలో ఒకటిగా మిగిలిపోయింది.తీవ్రమైన సమయాభావంతో ప్రతి రోజూ ఉద్యోగరీత్యా రానుపోను 65కి.మీ.నా ప్రయాణ సమయాన్ని వృధా కానివ్వకుండా బస్ లో కథలు రాసే ఆలోచననిచ్చింది.ఆ మైనస్ ని ఏదోలా ప్లస్ చేస్తున్నాననే తృప్తినిచ్చింది.ఆరోగ్యవంతమైన దృక్పధాన్నలవరుచుకునేలా చేసిన నాన్నకు ప్రేమతో....
-గుడిపూడి రాధికారాణి.

నవంబర్,2016 భావతరంగిణి సాంస్కృతిక మాసపత్రికలో నా సమీక్ష..వానజల్లులు(పద్యమాల)--రచన:శ్రీ డి.రాములు.

6, అక్టోబర్ 2016, గురువారం

మిత్రులారా! నేటి(6.10.2016) "నేటి నిజం " పత్రిక లో శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారు సంకలనం చేసిన "మా అన్నయ్య" పుస్తకం పై సమీక్ష ప్రచురింపబడింది.అందులో "మా అన్నయ్య బంగారు కొండ" అనే శీర్షికతో నేను రాసిన కవిత ను బాగుందంటూ సమీక్షకులు ప్రశంసించడం నాకు ఉత్సాహాన్ని కలిగించింది. ఆ కవిత, ఆ సమీక్ష మీ కోసం..నా ఆనందంలో పాలు పంచుకుంటారని భావిస్తూ..ఉగాదినాడు ఆ కవితకు కవిసత్కారం చేయడమే కాక 36 మంది కవితల్నీ పుస్తకంగా వెలువరించిన పెద్దలు శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారికి వందనాలతో..సమీక్షను పంపిన చలపాక ప్రకాష్ గారికి ధన్యవాదాలతో..

4, అక్టోబర్ 2016, మంగళవారం

got 3rd prize in children story competetion.

మిత్రులారా! శుభోదయం..రేపటికోసం మాసపత్రిక వారి కథలపోటీలో బాలల కథల విభాగంలో నా కథ "చదువు రుచి" తృతీయ బహుమతి గెలుచుకుంది.రేపటికోసం తొలివార్షికోత్సవ సందర్భంగా అనేక విభాగాలలో జరిగిన ఈ పోటీలకు స్పందన ఆశించిన దానికన్నా చాలా అధికంగా ఉందని నిర్వాహకులు పేర్కొన్నారు.విజేతలకు డిశెంబర్ లో మంగళగిరిలో జరిగే వార్షికోత్సవ వేడుకలలో బహుమతిప్రదానం జరుగుతుందని,వచ్చే సంచికనుండి బహుమతి పొందిన రచనల ప్రచురణ ప్రారంభం అవుతుందని తెలిపారు.

28, సెప్టెంబర్ 2016, బుధవారం

ఎంతో సంతోషంగా ఉంది.

మిత్రులారా! ఒక శుభవార్త మీతో పంచుకోవడానికి ఎంతో సంతోషంగా ఉంది.బాలసాహిత్యంలో నేను చేస్తున్న కృషికి మరో గుర్తింపు శ్రీశ్రీ పురస్కారం రూపంలో లభించింది.. ఈరోజు వార్తాపత్రికల్లో వివరాలు ప్రచురితమైనాయి.మీ అందరి ప్రోత్సాహమే నా ఉత్సాహాన్ని పెంచుతుందని వినయంగా తెలియజేస్తూ..మీ ఆశీస్సులు ఆశిస్తూ..ఈనాడు హాయ్ బుజ్జీ డెస్క్ కు హృదయపూర్వక ధన్యవాదాలతో....  

24, ఆగస్టు 2016, బుధవారం

కృష్ణా పుష్కర పురస్కారం

పుష్కరాల ముగింపురోజు(23.8.2016) న నేను రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ పక్షాన తెలుగు రక్షణ వేదిక వారిచే కృష్ణా పుష్కర పురస్కారం" అందుకున్నాను.ఈ పురస్కారాన్ని "ఆంధ్రప్రదేశ్ అధికార భాషా సంఘ అధ్యక్షులు, తెలుగు రక్షణ వేదిక జాతీయ అధ్యక్షులు శ్రీ పొట్లూరి హరి కృష్ణ గారు విజయవాడ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ హాల్ నందు జరిగిన కవితోత్సవంలో అందజేశారు.కృష్ణా జిల్లా డిప్యూటీ కలెక్టర్ ఎం.వి.సూర్యకళ గారు,కృష్ణా జిల్లా రచయితల సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీ జి.వి.పూర్ణచంద్,ప్రముఖ రంగస్థల నటులు శ్రీ మామిడి మురళీ కృష్ణ ల చేతులమీదుగా శ్రీ  పొట్లూరి హరికృష్ణ ఈ పురస్కారం అందజేశారు.


15, ఆగస్టు 2016, సోమవారం

ప్రశంసలు పొందాను

70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నాకెంతో ప్రత్యేకమయినవి మిత్రులారా! ఎందువలనంటే కృష్ణాజిల్లా ముఖ్య పట్టణమైన మచిలీపట్నం లోమంత్రివర్యులు శ్రీ దేవినేని ఉమా మహేశ్వర రావు,శ్రీ కొల్లు రవీంద్ర గార్లు, పార్లమెంట్ సభ్యులు శ్రీ కొనకళ్ళ నారాయణ రావు గారు మరియు కలెక్టర్ బాబు ఎ.గార్ల ప్రశంసలు పొందాను. విద్యా శాఖ వారి స్టాల్ లో నేను గణిత నమూనాలు మరి నా రచనలను ప్రదర్శించాను.విద్యా శాఖ-సర్వశిక్షా అభియాన్ వారి శకటం లో డిజిటల్ క్లాస్ నిర్వహించే ఉపాధ్యాయురాలిగా నేను నిలబడే అదృష్టాన్ని పొందాను.విద్యా శాఖ వారి రధమే ప్రధమ బహుమతి కూడా పొందడం ఆనంద దాయకం.
నాకు ఈ అవకాశం ఇచ్చిన విద్యా శాఖ అధికారులు ఎ.ఎం.ఒ.పి.వి.ఎం.రామదాసు గారికి ,ఉపాధ్యాయ మిత్రులు,తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య సహ కార్యకర్తలు శ్రీ అప్పినేడి పోతు రాజు,యెరపోతు నాగ వెంకట సురేష్ గార్లకు,కె.రఘురాం గారికి సహకరించిన ఇతరులకు హృదయపూర్వక ధన్యవాదాలు.
ఆ చిత్రాలలో కొన్ని మీ కోసం ఆనందంతో....














12, ఆగస్టు 2016, శుక్రవారం

పుష్కరాల తొలిరోజు

మా కుటుంబం పుష్కరాల తొలిరోజు (12.8.2016) పుష్కర స్నాన నిమిత్తం విజయవాడ వెళ్ళాము.ప్రకాశం బ్యారేజ్ కు అతిసమీపంలో గల కృష్ణవేణీ ఘాట్ నందు పుష్కర స్నానమాచరించాము.నీళ్ళు తక్కువగా ఉన్నప్పటికీ సరిపడ





లోతులో చాలినంత ఉండి పిల్లలు కూడా నిర్భయంగా స్నానం చేయుటకు వీలుగా ఉంది.నది నీరు స్వచ్చంగా ఉన్నవి.ఎప్పటికప్పుడు ఒడ్డునే కాక నదిలో వేస్తున్న పదార్ధాలను కూడా పారిశుద్ద్య సిబ్బంది తొలగించివేయడం హర్షణీయం.సమాచార కేంద్రములలో సత్వరమే అడిగిన సమాచారం ఇవ్వబడుచున్నది.తొలిరోజు అంత తక్కువ రద్దీ ని ఊహించలేదు.మహిళల స్నానానంతర దుస్తులు మార్చుకునే గదులు బాగున్నవి.రక్షణ సిబ్బంది,వాలంటీర్లు చక్కని సూచనలతో మైక్ సూచనలిస్తూ సహాయగుణం కనపరుస్తున్నారు.
సిద్దార్ధ కాలేజి నుండి బస్ స్టాండ్,ఘాట్లకు మరియు బస్ స్టాండ్ నుండి రైల్వే స్టేషన్ కు ఉచిత బస్సులు తిరుగుచున్నవి.బస్ స్టాండ్ లో ఉచిత భోజన వసతి,మజ్జిగ ప్యాకెట్లు యాత్రికులందరికీ పంపిణీ జరుగుతోంది.మేము టమాటా రైస్ తిని మజ్జిగ తాగాము.వేడిగా,రుచిగా రైస్ బాగుంది.అనేక కౌంటర్లుగా పెరుగు అన్నం,బిర్యానీ టమాటా బాత్  అల్యూమినియం ఫాయిల్స్ లో అందజేస్తున్నారు. వాటర్ ప్యాకెట్లు బస్ స్టాండ్,రైల్వే స్టేషన్,ఘాట్లు ఇలా అన్నిచోట్లా అందజేస్తున్నారు.
ఇలా  తొలిరోజునే మా పుష్కర స్నానం సంతృప్తిగా సరదాగా ముగిసింది.   

నా పుష్కర కవిత

శుభోదయం మిత్రులారా! పుష్కరాల సందర్భంగా తొలిరోజున(12.8.2016) నా పుష్కర కవిత **"ఆశ ఒకటి కలుగుతోంది"** ఈనాడు కృష్ణా లో ప్రచురితమయింది...చదువుతారు కదూ..మీ స్పందన ఆశిస్తూ...పుష్కర మరియు వరలక్ష్మీ వ్రత శుభాకాంక్షలు.

11, ఆగస్టు 2016, గురువారం

ఈనాటి(11.8.2016) ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 57వ కథ.."కోవా తిన్న కోతి."

ఈనాటి(11.8.2016) ఈనాడు హాయ్ బుజ్జీ లో నా కథ.."కోవా తిన్న కోతి." చదివి మీ అభిప్రాయం చెప్పండి మిత్రులారా!
అన్నట్లు ఉదయం 7-8 రాత్రి 8-9 మధ్య దూరదర్శన్ సప్తగిరిలో మా పుష్కర కవిసమ్మేళనం చూడడం మర్చిపోకండేం

10, ఆగస్టు 2016, బుధవారం

దూరదర్శన్ సప్తగిరిలో మా పుష్కర కవిసమ్మేళనం

రేపు (11.8.2016) ఉదయం 7-8 మరియు సాయంత్రం 8-9 దూరదర్శన్ సప్తగిరిలో మా పుష్కర కవిసమ్మేళనం ప్రసారమవుతుంది.మీ స్పందన ఆశిస్తూ..శుభసాయంత్రం మిత్రులారా!

8, ఆగస్టు 2016, సోమవారం

ఈ నెల (ఆగస్ట్,2016) భావతరంగిణి సాంస్కృతిక మాసపత్రికలో నా సమీక్షలు.

ఈ నెల (ఆగస్ట్,2016) భావతరంగిణి సాంస్కృతిక మాసపత్రికలో నా సమీక్షలు.

వికటకవికల్పితకథలు-శ్రీ బెల్లంకొండ నాగేశ్వర రావు,చెన్నై.
2.సత్యసాయి శతకము-శ్రీ మెండు సుబ్బా రావు,మచిలీపట్నం.

5, ఆగస్టు 2016, శుక్రవారం

నా బంగారు తల్లీ!

నా బంగారు తల్లీ!
నిన్ను చూసి ఆపరేషన్ బాధ మర్చిపోయిన క్షణాన నువ్వో అద్భుతానివి.. 
నీకు పాలిస్తూ నిన్ను లాలిస్తూ మురిసిపోయిన క్షణాన నువ్వో ఆహ్లాదానివి.
పుట్టిన 25వ రోజునే నా కళ్ళలోకి చూస్తూ....ఒక..చిన్న నవ్వు..నవ్విన క్షణాన నువ్వో సంభ్రమానివి.
రెండో ఏటనే నీకు జాబిల్లిని చూపిస్తూ బువ్వ తినిపిస్తుంటే ..
"అమ్మా! అదిగో చూడు.చందమామ మబ్బుల దుప్పటి కప్పుకుంది." అని
నువ్వు పలికిన క్షణాన నువ్వో నమ్మలేని ఆశ్చర్యానివి.
4వఏటనే తప్పుల్లేకుండా తెలుగు చదువుతూ రాస్తుంటే నువ్వో అబ్బురానివి.
తమ్ముడితో అనురాగంతోనే అల్లర్లు పంచే క్షణాన ఒక ఆనందానివి.
సునాయాసంగా ఐ.ఐ.టి. సీట్ తెచ్చుకున్న క్షణాన ఆ వార్త కన్నా నీ మొహంపై వెలిగిన నవ్వే నన్ను వెలిగించిందమ్మా!
నా బంగారు తల్లీ! నీ జీవితం ఆసాంతం తృప్తిగా సాగిపోవాలని ఈ జన్మ దిన సమయాన ఆ దేవదేవుని మనసారా కోరుకోవడం తప్ప మరేమి కానుక ఇవ్వలేని అమ్మను.
శెలవు లేక శారీరకంగా నీ దగ్గర లేకున్నా నా మనసు ఈరోజే కాదు..ఎప్పుడూ నీ దగ్గరే ఉంటుందమ్మా!
నీ క్షేమమే కోరుతుంటుంది.
పుట్టిన రోజు ఆశీస్సులతో...అమ్మ.


30, జులై 2016, శనివారం

సంతోషాన్ని మీతో పంచుకోవాలని....

మిత్రులారా! ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ వారు త్వరలో ఆవిష్కరించనున్న పుష్కర ప్రత్యేక సంచిక.."కృష్ణా తీరం" లో నా వ్యాసం.."బందరులో బ్రౌన్ భాషా సేవలు" ప్రచురింపబడనున్నది.ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలని....
అంతేకాదు మిత్రులారా! ఉగాది తర్వాత మరల నేను దూరదర్శన్ లో పుష్కరాల సందర్భంగా కవిసమ్మేళనం లో పాల్గొన్నాను.సప్తగిరి దూర్ దర్శన్ వారు 20-07-2016 న కృష్ణాపుష్కర వైభవం 2016 పేరుతో డా.జి.వి.పూర్ణచంద్  అధ్యక్షతన ఒక కవిసమ్మేళనం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ప్రముఖ కవులు ఎడమనుండి శ్రీ యంపి. జానుకవి,డా. జంధ్యాల పరదేశిబాబు, శ్రీ సి హెచ్ వి బృందావనరావు, శ్రీ యలమర్తి రమణయ్య, శ్రీ పింగళి వెంకట కృష్ణారావు, శ్రీమతి గుడిపూడి రాధికారాణి(నేను), డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, డా.జి.వి.పూర్ణచంద్, శ్రీ శిఖా ఆకాష్, కవి కరీముల్లా , డా. పాపినేని శివశంకర్, శ్రీమతి పుట్టి నాగలక్ష్మి, శ్రీ అజ్మీర్ వీరభద్రయ్య, డా. భూసురపల్లి వెంకటేశ్వర్లు, డా. రావి రంగారావు ఈ కవిసమ్మేళనంలో పాల్గొన్నారు
ఎందరో లబ్దప్రతిష్టులమధ్య నాకు స్థానం లభించడం నాకు ఎంతో ఆనందాన్నిస్తోంది.నాకు ఈ అవకాశం ఇచ్చిన కృష్ణాజిల్లా రచయితల సంఘం శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారు,డా.జి.వి.పూర్ణచంద్ గార్లకు నమస్సుమాంజలులు.

28, జులై 2016, గురువారం

కవిత...* " ఆకాంక్ష. " *

తెలుగు విద్యార్ధి-జులై,2016 సంచికలో నా గేయం..* " ఆకాంక్ష. " * నాకు నచ్చిన రచన..ఉగాది నాడు వ్రాసినది. మీ  అభిప్రాయం ఆశిస్తూ..మీ కోసం.


24, జులై 2016, ఆదివారం

నా సమీక్ష

ఈరోజు(24/7/2016) రచయిత్రి శ్రీమతి వాడవల్లి విజయ లక్ష్మి గారి స్వర్ణోత్సవ సంచిక ఆవిష్కరణ వేడుక జరిగింది.ఇండియన్ కల్చరల్ అసోసియేషన్(భవిష్య గారు) నిర్వహణ లో జరిగిన సభకు కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారు అధ్యక్షత వహించగా శ్రీ కొల్లు రవీంద్ర,శ్రీ ఆర్.వి.ఎస్.రాజు గారు, డా.మాదిరాజు రామలింగేశ్వర రావు,శ్రీ సవరం వెంకటేశ్వరరావు తదితరులు ప్రసంగించారు. బాలసాహిత్య రచయిత్రి,వ్యాసకర్త,ఆధ్యాత్మిక పుస్తక,కథా,నవలా రచయిత్రి వాడవల్లి గారు "అనంతానంద శిఖరము" అనే ఒక ఆధ్యాత్మిక పుస్తకం రచించియున్నారు.ఆ పుస్తకము పై నా సమీక్ష స్వర్ణోత్సవ సంచికలో చోటు చేసుకుంది.


20, జులై 2016, బుధవారం

దుర్ముఖి నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఉయ్యూరు సరసభారతి (శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్) వారు నిర్వహించిన "మా అన్నయ్య"కవి సమ్మేళనం లో ని కవితా సంకలనం లో నా కవిత..

దుర్ముఖి నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఉయ్యూరు సరసభారతి (శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్) వారు నిర్వహించిన "మా అన్నయ్య" కవిసమ్మేళనం లో 35 కవితల సంకలనం ఆవిష్కరింపబడింది.అందులో నా కవిత..ఆవిష్కరణ సమయం లో నేను చెన్నై లో ఉండి రాలేకున్నా  2 పుస్తకాలు ఇంటికి పోస్ట్ లో పంపిన శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు.