28, ఫిబ్రవరి 2016, ఆదివారం
జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని బంటుమిల్లి మండల స్థాయిలో సైన్స్ ఫెయిర్ జరిగినది. నేను గణిత అంశాలకు న్యాయ నిర్ణేతగా వ్యవహరించాను. పెదతుమ్మిడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వారు కార్యక్రమమును చాలా బాగా నిర్వహణ చేసారు. పి.ఆర్.టి.యు వారు ఉత్తమ సైన్స్ ఉపాధ్యాయులకు సన్మానం చేసారు. వారికి, సైన్స్ క్విజ్, సైన్స్ ఫెయిర్ విజేతలకు జాతీయ సైన్స్ దినోత్సవ శుభాకాంక్షలు.
లేబుళ్లు:
ఉపన్యాసం,
ఒక మాట..,
పత్రిక లో నేను.
23, ఫిబ్రవరి 2016, మంగళవారం
మిత్రులారా..ఒత్తిడి నుండి ఉపశమనం కోసం...హాయ్ బుజ్జీ పజిల్స్ సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించా..ఆ క్రమంలో నా 601(2) వ పజిల్ ఇదిగో....ఈనాటి ఈనాడు హాయ్ బుజ్జీ లో.
లేబుళ్లు:
ఈనాడు,
ఈనాడు హాయ్ బుజ్జీ,
పజిల్,
పత్రిక లో నేను.,
బాల సాహిత్యం
21, ఫిబ్రవరి 2016, ఆదివారం
నిన్న సాయంత్రం (20/2/2016) ఇండియన్ కల్చరల్ అస్సోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సదస్సు ఘనం గా జరిగింది..ఆ వివరాలకు చెందిన నేటి పేపర్ క్లిప్స్ ....నేను అతిధులను సభకు పరిచయం చేశాను. ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమ నిర్వహణ లో పాల్గొన్నాను. ఐ.సి.ఏ.ఫౌండర్ చైర్మన్ భవిష్య గారికి అభినందనలు.
లేబుళ్లు:
ఉపన్యాసం,
పత్రిక లో నేను.,
పురస్కారాలు
14, ఫిబ్రవరి 2016, ఆదివారం
ప్రేమికుల దినోత్సవం గా చాలా మంది జరుపుకునే ఫిబ్రవరి 14 ని చత్తీస్ ఘడ్ ప్రభుత్వం అమ్మా,నాన్న ల ను పూజించే,స్మరించుకునే రోజు గా జరుపుకోమని ప్రకటించింది. నేను 6వ తరగతి లో చేరిన 2 నెలలకే గుడివాడ పట్టణ స్థాయి లో డిబేట్ పోటీ జరిగింది.నేను చాలా ధైర్యంగానూ, అద్భుతంగానూ పెద్దలు ఉపన్యసించిన స్థాయి లో చెప్పానని ఒకటే పొగిడారు.ఎవరో గొప్పాయన చేత నాకు ప్రధమ బహుమతి ఇప్పిస్తాం.2 రోజులాగి ఆదివారం సాయంత్రం ఒక వేదిక కు రమ్మన్నారు.(గుర్తు లేదు) అది ఇంటి దగ్గరే.ఫ్రెండ్ తో వెళ్ళి తెచ్చుకో.అన్నారు టీచర్స్. నాన్నకు చెప్పా.స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగి అయిన నాన్న కు చాలా పని ఉందిట.సరే అన్నారు. కానీ ఆ సమయానికి వచ్చి నన్ను తీసుకువెళ్ళి ఫొటో తీయించారు.నేను బహుమతి అందుకుంటుంటే నాన్న కళ్ళలో ఎంత సంతోషమో. అది మొదలు డిగ్రీ వరకు డిబేట్ అంటే బహుమతి నాదే. ఈ రోజు నేను ఎన్ని ఉపన్యాసాలు,సమీక్షలు చేసినా ఈ చప్పట్లు విన్నప్పుడల్లా నాకు గుర్తొచ్చేది నాన్న మెరిసే కళ్ళే. బిజీ షెడ్యూల్స్ అంటూ పిల్లల్ని నిర్లక్ష్యం చేయకుండా నాన్న తీసుకున్న ఆ చిన్న చర్య నాకు ఎన్ని బహుమతులు,గుర్తింపు,ధైర్యం ,ఆత్మవిశ్వాసం తెచ్చాయో కదా.. నాన్న భౌతికంగా నన్ను వదిలి వెళ్ళినా ఎప్పుడూ నా మనసులో సజీవంగా ఉంటారు.
12, ఫిబ్రవరి 2016, శుక్రవారం
29/01/2016 న నేను బాలసాహితీ పురస్కారం అందుకున్నప్పుడు.... " నిజమే..నేను సమీక్షలు,ఉపన్యాసాలు,గణితబోధన(పరీక్షలు సమీపించడం,మారిన మూల్యాంకన విధానం) పెరిగి..సమయం చాలడం లేదు అని నా మనసు ని మోసం చేసుకుంటూ..పిల్లల కథలు తగ్గించాను. ఈ పురస్కారం నాకు ఆ విషయం గుర్తు చేసింది.రోజుకో కథ రాసే ఆ ఉత్సాహం మళ్ళీ రావాలి..ఎప్పటిలాగే బస్ లో అయినా రాసేయాలి." ఈ పిక్ దిగేటప్పుడు ఇవీ నా మనసులో మెదిలిన భావాలు.
లేబుళ్లు:
ఒక మాట..,
నా సాహితీ పురోగతి.,
పిల్లల కథ,
పురస్కారాలు,
బాల సాహిత్యం
10/2/2016 న భావతరంగిణి "భవిష్య" గారు పీపుల్స్ చాయిస్ అవార్డ్-2016 అందుకున్న సందర్భం...నేను అతిథులను పరిచయం చేశాను. ఎ.పి ఎడిటర్స్ అస్సోసియేషన్ అధ్యక్షులు వి.వి.ఆర్.కృష్ణం రాజు గారు , సహకమిషనర్ విజయ్ బాబు,దూరదర్శన్ సప్తగిరి చానల్ హనుమంతరావు గారు,గుత్తికొండ సుబ్బా రావు గారు,హై కోర్టు సీనియర్ న్యాయవాది ప్రసాద్ బాబు గారు,సైకం భాస్కర్ రావు గారు,డా.బి.ధన్వంతరి ఆచార్య లు గౌరవ అతిథులుగా ఉన్నారు.
లేబుళ్లు:
నా సాహితీ పురోగతి.,
పత్రిక లో నేను.
9, ఫిబ్రవరి 2016, మంగళవారం
ఈ రోజు(9/2/2016) ఈనాడు-హాయ్ బుజ్జీ లో ప్రచురితమైన నా 52వ కథ.."వానొస్తే బెకబెకలు..అవి కప్పల పకపకలు.."
లేబుళ్లు:
52,
ఈనాడు,
ఈనాడు హాయ్ బుజ్జీ,
కథ,
పిల్లల కథ,
బాల సాహిత్యం
8, ఫిబ్రవరి 2016, సోమవారం
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)