24, జూన్ 2017, శనివారం

వాడంతే! -గుడిపూడి రాధికా రాణి.


గురుప్రసాద్ మీడియా డైరెక్టరీ లో లిటరరీ పర్సనాలిటీస్ విభాగం కొరకు నా వివరాలు అడిగి తీసుకుని చేర్చటమే కాక శ్రద్దతో నాకు చేరేలా పుస్తకం ప్రతిని పంపిన యువకళావాహిని శ్రీ వై.కె.నాగేశ్వర రావు గారికి ధన్యవాదాలు.

Guru Prasad Media Directory released at the Cultural Centre of Vijayawada and Amaravathi in ANDHRA PRADESH STATE to-day. Dr.D.Vizaibhaskar, Director, Andhra Pradesh Langugue and Cultural Department released the Directory. Padmasri Dr.Thurlapati Kutumba Rao, Dr.Modali Nagabhooshana Sharma, Dr.Emani Sivanagi Reddy, Smt.Ln Laxmi Kumari, Sharada Kalasamithi Sri Dogiparthi Shankar Rao, Sri G.Narayanayana Rao and Yuvakalavahini Ln YK Nageswara Rao participated in the function, Singers Mohammad and Rasool Babu presented the film music.



20, జూన్ 2017, మంగళవారం

బాల్యం లో ఒక జ్ఞాపకం...

బాల్యం లో ఒక జ్ఞాపకం...
-------------------

ఒకసారి సర్కస్ వచ్చింది ఊళ్ళోకి..
ఇంక చూడండి బళ్ళో.. ప్రతిరోజూ..రోజుక్కొందరు పిల్లలు మేం చూశాం అంటే మేం చూశాం మేం వెళ్ళాం అంటే మేం వెళ్ళాం..వాళ్ళు సర్కస్ లో చూసిన జంతువులు చేసిన విన్యాసాలు,మనుషులు ఆడిన ఆటలు,జనాలు వేసిన విజిల్స్, వీళ్ళు కొట్టీన కేరింతలు..ఒకటే వర్ణించడం.
వాళ్ళు ఆ రోజుకి హీరోలు;అప్పటికింకా వెళ్ళని వాళ్ళకి ఒకటే ఆరాటం పెరిగిపోవడం..ఇంటికెళ్ళిపోయి అమ్మ దగ్గర గారాలు,నాన్నకి అమ్మతో సిఫార్సులు..
శివరామ కృష్ణ వెళ్ళిన రోజైతే మా ఇంగ్లీష్ మాష్టారు కూడా కుటుంబ సమేతంగా వెళ్ళార్ట.మాధవి వెళ్ళినప్పుడేమో  మా లెక్కల మాష్టారిని చూసిందిట వాళ్ళబ్బాయితో..పాఠాల సంగతేమో గానీ ఈ కబుర్లెక్కువైపోయాయ్.వెళ్ళని వాళ్ళకేమో ఎప్పుడెప్పుడా అని ఆరాటం పెరిగిపోతోంది.
    హమ్మయ్య! నా రోజొచ్చింది.స్టేట్ బ్యాంక్ లో మేనేజర్ అయిన నాన్న ఆ సాయంత్రం తొందరగా వస్తానని,అందర్నీ తీసుకెళ్తాననీ మాటిచ్చారు.అందరం బోల్డు సంబరంగా తయారయ్యాం.బయటపడలేదు కానీ అమ్మక్కూడా సరదాగానే ఉందని పసిగట్టాం.బయట జనం మూగిన చోట అమ్మేవి కొనుక్కోవడం ఆరోగ్యానికి మంచిది కాదంటూ అమ్మ జంతికలు,సున్నుండలు,నీళ్ళ సీసాలు పెట్టింది."అవేం అక్కర్లేదు.ఆ ఏనుగులు,సిం హాలు,కోతులు,బఫూన్లు చూస్తేనే చాలు..ఆకలి కూడా గుర్తు రాదు"అని మేం చెప్తున్నా వినకుండా తొమ్మిది దాటుతుంది.ఆకలంటారంటూ..
  అన్నట్లే నాన్న త్వరగా వచ్చి మమ్మల్ని తీసుకెళ్ళారు.మొదటి వరుసలో దగ్గరగా కూర్చుని చూసేలాగా టిక్కెట్లు కొన్నారు.ఆనందంగా సెటిలయ్యాం.కాసేపటికే హాలు నిండిపోయింది.
ఎదురు చూసి,కలవరించిన సర్కస్ మొదలైపోయింది. హమ్మయ్య...
కానీ...ఒక పావుగంట కూడా అవలేదు.పులి,సిం హం రానే లేదు.గుండ్రటి ఇనుప బంతిలో అబ్బాయి మోటార్ సైకిల్ నడపనేలేదు.అందమైన అమ్మాయిలు గిరగిరా తిరుగుతూ..ఉయ్యాలలూగుతూ సందడి చేయనేలేదు.పొట్టి జోకర్లొచ్చి సరిగ్గా నవ్వించడం మొదలెట్టనే లేదు..కోతులు కాసిని వచ్చి ఆడాయ్,సైకిల్ తొక్కాయ్ అంతే..ఒక ఏనుగొచ్చి బల్లపై ముందు కాళ్ళు ఆనించి  తొండం ఎత్తుతోంది...
    ఠప్!! లైట్లారిపోయాయ్!! కరంటు పోయిన వెంటనే...హోరెత్తే మ్యూజిక్ ఆగిన వెంటనే అందరి చెవులకీ సోకిన గాలి మోత..గాలి,పెను గాలి,ఉరుముల శబ్దం,మెరుపుల వెలుగులో  అందరి మొహాల్లో ప్రతిఫలిస్తున్న నిరాశ..కాసేపటికే నెత్తి మీద షామియానా పైన టపటప మంటొ చినుకుల మోత..చాలా కొద్దిసేపట్లోనె భారీగా మారిన వర్షం..గాలి తాకిడికి ఊగిపోతున్న షామియానాలు..మరో అరగంటకి కుండపోతగా వర్షం..దూరంగా పిడుగుల మోత..అందరి మొహాల్లో ఆందోళన గా మారిన నిరాశ.
పెద్ద శబ్దంతో షామియానా పడిపోయింది.కేకలు వేస్తూ,తొక్కిసలాడుతూ..జనమంతా బయట పడ్డారు.ఎవరికి వాళ్ళే ఆ కూలిపోయే టెంట్లకి,కరంటు వైర్లకి దూరంగా వెళ్ళాలని తహతహలాడారు.వర్షంలో తడుస్తున్నా లెక్క చేయకుండా బయట పడ్డారు.కొందరు షాపుల అరుగులపై చేరినా ఇప్పుడిప్పుడే తగ్గే వాన కాదని నిర్ణయించుకుని తడుస్తూనే ఇంటిదారి పట్టారు.
   మేమూ నడుస్తున్నాం.ఏనుగుతొండాల్తో దిమ్మరించినట్లు పెద్ద వాన..విడిగా తడుస్తాం అంటే ఒప్పుకోరుగా! అందుకని మాకు ఆనందంగా ఉంది అలా అంత ధారల్లో తడుస్తూ నడవగలగడం ...సర్కస్ కోల్పోయిన నిరాశని తాత్కాలికంగా పోగొట్టింది ఆ సంతోషం..ఇంటికెళ్ళాక  అమ్మ వేడి వేడిగా ఉప్మా చేసింది.అందరం తింటున్నాం.రేపు ఫ్రెండ్స్ నవ్వుతారేమో..ఎలా అనే ఆలోచన నాదీ,చెల్లిదీ.అక్కేమో రేపు బడి ఎగ్గొట్టేస్తే! అనే ఆలోచనలో ఉందనుకుంటా.మీకూ,పిల్లలకి జలుబు చేయకుండా ఉంటే బాగుండు అంటోంది అమ్మ నాన్నతో.. మరి అమ్మ కదా!
   ఇంతలో అన్నయ్య అన్నాడు.."సర్కస్ వాడికి లాభం మనకి నష్టం..మన టిక్కెట్లు వేస్టయిపోయాయి.వాడు షో వేయక్కర్లేకుండా డబ్బులొచ్చేశాయ్." అని.
   అప్పుడు నాన్న అన్న మాటలు నాకో విలువైన పాఠం." అలా అనుకోకూడదు మనం..తన నలుగురు పిల్లలు తడిస్తేనే అమ్మ ఎంత ఆదుర్దా పడుతోందో చూశావు కదా! మరి వాళ్ళకి ఎంత కష్టం అన్ని మూగప్రాణాలు,అంతమంది మనుషులు.. వారికి రక్షణ,ఆహారం..ఏం వైర్లు తగిలి షాక్ కొడుతుందో అని టెన్షను..ధ్వంసమైన టెంటు సామాను,కుర్చీల సంగతి చూసుకోవాలి..ఈ రాత్రి వారికి ఎంత ఇబ్బందికరమైనదిగా మారుతుందో ఆలోచించండి.మనం పొడిబట్టలేసుకుని,వేడిగా ఇంత తిని నిశ్చింతగా దుప్పట్లు కప్పుకుని పడుకోగలిగిన స్థితిలో కూడా ఎదుటివారి ఇబ్బంది ని ఊహించి అంగీకరించగలగడం నేర్చుకోవాలి..ఆ గుణమిప్పటినుండి ఉంటేనే పెద్దయినాక సహాయం చేసే ఉద్దేశ్యం కలుగుతుంది."

సమస్యను ఎదుటివారి కోణం లో చూడమని నేర్పిన నాన్నకు ప్రేమతో*******  

15, జూన్ 2017, గురువారం

ఉపన్యసించడం,

మిత్రులారా! నిన్న (11.6.2017) సాయంత్రం గుడివాడ షా గులాబ్ చంద్ గ్రంథాలయంలో భారతీ సమితి ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీత,ప్రముఖ నగిషీ చిత్రకారుడు శ్రీ దర్శి జ్వాలాచారి గారి అభినందన సత్కార సభలో నేను ముఖ్య అతిథిగా పాల్గొన్నాను.
రాష్ట్ర కవి శ్రీ శంకరంబాడి సుందరాచారి జీవన రేఖలను,సాహితీ ప్రస్థానాన్ని సాకల్యంగా వివరించే భాగ్యం పొందాను.అభిమానంతో తన పుస్తకాలను ఇచ్చి ఆశీర్వదించిన శ్రీ Vasudha B Rao గారికి విశ్రాంత డైట్ ప్రిన్సిపాల్ శ్రీ ఎం.వి.జి.ఆంజనేయులు,కృష్ణా తరంగాలు మాసపత్రిక సహ ఉపసంపాదకులు శ్రీ రాఘవాచారి గారు ముఖ పుస్తక మిత్రులు శ్రీ వంశీ,తదితరులను కలవడం ఒక ఆనందమైతే ...పుట్టిల్లు గుడివాడ లో (6వ తరగతి నుండి వివాహం వరకు అక్కడే) ఉపన్యసించడం, నాన్న మిత్రులు రంగా అండ్ కో అధినేత ఆశీర్వదించడం..ఒక గుర్తుండిపోయే మంచి సందర్భం..నిర్వాహకులకు,శ్రీమతి పుట్టి నాగలక్ష్మి గారికి ధన్యవాదాలు.Image may contain: 4 people, people sitting and indoorImage may contain: 4 people, people standing

ఈనాటి (15.6.2017) ఈనాడు హాయ్ బుజ్జీ లో నేను వ్రాసిన 68వ పిల్లల కథ.."కోతి నేర్చుకుందో పాఠం! ".