20, మే 2020, బుధవారం

త్రిశూల్ డైలీలో 19.5.2020 న నా ఇష్టపది"మాట మహిమ"ప్రచురితం.

త్రిశూల్ డైలీలో 19.5.2020 న నా ఇష్టపది"మాట మహిమ"ప్రచురితం.
**మాటమహిమ**
మాటెంతో గొప్పది
మహిమాన్వితమైనది
వాక్కు మధురమైతే
వక్తలకూ గౌరవము
చల్లగా పలకగా
చలిమంటలా హాయి
కటువుగా ఖండించ
కార్చిచ్చులా తోచు
గుసగుసగా పలికిన
గుండెలో గమ్మత్తు
కసురుకుంటు చెప్పిన
కళ్ళలో కన్నీరు
తగురీతిన పలికిన
తగాదాలకు స్వస్తి
రాధికా వాక్కులివి
రమణీయమే కృష్ణ!
-- గుడిపూడి రాధికారాణి,
మచిలీపట్నం.
(ఇష్టపది-19.5.2020)
Image may contain: గుడిపూడి రాధికారాణి, text

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి