9, ఏప్రిల్ 2016, శనివారం

ఒక మాట ...ఆనందంగా..

మిత్రులారా..మన్మథ నామ సంవత్సరం నాకు ఎన్నో మధురమైన విజయాలను అందించింది..నేను ఒక సమీక్షకురాలిగా,వక్తగా,శీర్షిక నిర్వాహకురాలిగా ఎదిగే ఎన్నో అవకాశాలను అందించింది.నేను ఒక బ్లాగర్ కావాలనే సరదా తీరింది.
కృష్ణాజిల్లా రచయితల సంఘం వారు,భావతరంగిణి సాంస్కృతిక మాసపత్రిక,పలు సంస్థలు,పెద్దలు,బందరుబంధువులు గ్రూప్ ఇలా..ఎందరి నుండో ఆశీస్సులు,అవకాశాలు అందాయి.
విశ్వనాథ సత్యనారాయణ జాతీయ సదస్సు లో పాల్గొనడం ఒక మర్చిపోలేని మధుర జ్ఞాపకం.మహనీయులు గరికిపాటి నరసిం హా రావు గారి చేతులమీదుగా శాలువా,జ్ఞాపిక అందుకోవడం మరో గొప్ప జ్ఞాపకం.ఎన్నో వేల పుస్తక సమీక్షలు చేసిన ప్రముఖులు శ్రీ ద్వా.నా.శాస్త్రి గారి పుస్తకం.."అలనాటి విశేష కవితలు" సభాముఖంగా నేను సమీక్ష చేయడం...
దూరదర్శన్,ఆకాశవాణి కార్యక్రమాలు,కథలు రాసే నేను బందరుబంధువులు ఆత్మీయ కలయిక లో కథలు చెప్పి మెప్పు పొందడం,వారి ప్రోత్సాహం,చెప్పాలంటే ఇంకా చాలా ఉన్నాయి.
ముఖ్యంగా సిలార్ గారు అతి త్వరలో ఆవిష్కరించబోయే ఎన్సైక్లోపీడియా ఆఫ్ మచిలీపట్నం గ్రంధంలో సాహితీవేత్తల పరిచయం  లో నా పేరు,వివరాలకు కు స్థానం దొరకడం నా అదృష్టం. 
ఉగాది కవి సమ్మేళనాలు చాలా జరిగాయి.నేను పాల్గొని చదివిన కవితలన్నీ అతి త్వరలో మీతో పంచుకుంటానని సవినయంగా మనవి చేస్తున్నాను.కాంత్ జొన్నలగడ్డ వారి కోరిక మేరకు రేపు టి.వి. కవిత తో ప్రారంభిస్తాను.
ధన్యవాదాలు..శుభరాత్రి.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి