21, మార్చి 2020, శనివారం

16, మార్చి 2020, సోమవారం

నా మూడు పుస్తకాలు.



 నా మూడు పుస్తకాలు..
 ముందుమాట రాసి ఆశీర్వదించిన మాన్యులకు వందనాలు.
1. చెట్లు ఆరోగ్యానికి మెట్లు...
డా.బృందావనం ధన్వంతరి ఆచార్యులు గారు మరియు డా.జి.వి.పూర్ణచంద్ గారు,శ్రీ వడిచర్ల సత్యం గారు (ప్రక్రియ సృష్టి కర్త)
2.వాగ్దేవీ! వందనం!!
డా.గుడిసేవ విష్ణు ప్రసాద్ గారు , డా.అడిగొప్పుల సదయ్య గారు (ప్రక్రియ సృష్టి కర్త)
3. జీవిత సత్యాలు
డా.గుత్తికొండ సుబ్బారావు గారు , శ్రీ రమేష్ గోస్కుల గారు (ప్రక్రియ సృష్టి కర్త).
.

జనవరి,2020 తెలుగువిద్యార్థి మాసపత్రికలో డా.మాదిరాజు రామలింగేశ్వర రావుగారికి అక్షరాంజలిగా నేను సమర్పించిన వ్యాసం ప్రచురితం.

జనవరి,2020 తెలుగువిద్యార్థి మాసపత్రికలో డా.మాదిరాజు రామలింగేశ్వర రావుగారికి అక్షరాంజలిగా నేను సమర్పించిన వ్యాసం ప్రచురితం.

Image may contain: 7 people
Image may contain: గుడిపూడి రాధికారాణి

మార్చ్,2020 భావతరంగిణి మాసపత్రికలో నా 3 సమీక్షలు..

మార్చ్,2020 భావతరంగిణి మాసపత్రికలో నా 3 సమీక్షలు..
1.దగ్ధపల్లవుల పాట(దీర్ఘ కవిత)--శ్రీ ఏటూరి నాగేంద్ర రావు
2.మనిషి కనబడుటలేదు(కవిత్వం)--శ్రీ గుడిమెట్ల చెన్నయ్య
3.అన్నపూర్ణమ్మకు అక్షరాంజలి(80 మంది కవుల పంచ ప్రక్రియల సంకలనం)--శ్రీ శిష్ఠు సత్య రాజేష్.

Image may contain: 2 people

(14.3.2019) ఈనాడు కృష్ణా సెంటర్ స్ప్రెడ్ లో నా కవిత.."ఓటును నమ్ముకో..అమ్ముకోకు"

(14.3.2019) ఈనాడు కృష్ణా సెంటర్ స్ప్రెడ్ లో నా కవిత.."ఓటును నమ్ముకో..అమ్ముకోకు"
Image may contain: 1 person

my third book

Image may contain: 2 people

ఈనాడు హాయ్ బుజ్జీలో నా 84 వ కథ.."గాయం నేర్పిన పాఠం".(29.2.2020)

my second book

4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల ప్రత్యేక సంచిక "తెలుగు ప్రపంచం " లో ప్రచురితమైన నా గజల్.

4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల ప్రత్యేక సంచిక "తెలుగు ప్రపంచం " లో ప్రచురితమైన నా గజల్.
Image may contain: 1 person, text that says "అమ్మ కాపాడుకుందాం స్వాభిమానం చాటుకుందాం ఈ తెలుగు ప్రపంచం ప్రత్యేక సంచిక SOUVENIR 4వ ప్రపంచ తెలుగు రచయితల 2019 27, 28, 29 విజయవాడ"
Image may contain: text that says "ఘజల్ ఫోన్ 9494942583 చేరి ఉంది నా హరివిల్లుకు ఉంది నా మనసే చేరాలని సాగి ఉంది నా మనసే పూలు ఉన్న వెతుకుతోంది సంశయాల చేత రగిలి నా దొంగకూడ దొరలాగా తిరగడమే చూసిందోయ్ విసిగి ఉంది నా మనసే గుండెలోని తడిని వదిలి మనుషులేల విస్తుబోయి చితికి ఉంది నా మనసే దేవుడికొక వాటానా? ఈ లోకుల తీరు ఉషోదయపు కాంతిరేఖ ఉల్లానపు వెలుగుకొరకు వేది ఉంది మనసే పంచుకుంటు తింటు హాయిగ కులమతాల కుమిలి ఉంది నా మనసే కమ్మనైన పిలుపులోన విషమున్నది నాగులాంటి ఉంది నా మనసే"

(15.1.2020) ఈనాడు కృష్ణా సెంటర్ స్ప్రెడ్ లో నా సంక్రాంతి కవిత

(15.1.2020) ఈనాడు కృష్ణా సెంటర్ స్ప్రెడ్ లో నా సంక్రాంతి కవిత

స్వాగత పత్ర సమర్పణ

పూర్వజన్మ సుకృతం ఈ ప్రాప్తం..కార్తీక దీపోత్సవ వేళ మైసూరు దత్తపీఠం ఉత్తరాధిపతి శ్రీశ్రీ దత్తవిజయానంద తీర్థ స్వామీజీకి పద్య రూపంలో స్వాగత పత్ర సమర్పణ మహద్భాగ్యం..
Image may contain: 2 people, including గుడిపూడి రాధికారాణి, people on stage and people standing

my first book

(26.1.2020) గోదావరి దినపత్రికలో నా గజల్ ..

Image may contain: గుడిపూడి రాధికారాణి, text that says "గోదావరి కట్టుకున్న కలలమేడ కూలినపుడు ఏడ్వలేదు అల్లుకున్న ఆశలన్ని అణిగినపుడు ఏడ్వలేదు పదునుకత్తి అంచుమీద అవలీలగ నడవగలను అదునుచూసి నాదారిని మూసినపుడు ముళ్ళున్నా రాళ్ళున్నా నాపయనము మానలేదు పాదరక్షలేవంటూ నవ్వినపుడు ఏడ్వలేదు గగనంలో అడ్డంకిగ మారలేదు అపోహతో నారెక్కలు విరిచినపుడు ఏడ్వలేదు గాలిపటం లాగనేను విహరిద్దాం అనుకున్నా పరులతప్పు నా బతుకును ఏడ్వలేదు రంగులన్ని హంగులన్ని విలువపోయి మిగిలినాయి ముసిరినట్టి బంధువులే కసిరినపుడు ఏడ్వలేదు గుండెగోడు చెప్పుకుంటె గుబులుతీరు రాధికమ్మ చెప్పుకోగ ఎండమావి దొరికినపుడు ఏడ్వలేదు. గుడిపూడి రాధికారాణి మచిలీపట్టణం"

(డిసెంబర్,2019) భావతరంగిణి మాసపత్రికలో ప్రచురితమైన నా సమీక్షలు..



(డిసెంబర్,2019) భావతరంగిణి మాసపత్రికలో ప్రచురితమైన నా సమీక్షలు..
1.స్టాంపుల్లో మహాత్ముడు- శ్రీమతి పుట్టి నాగలక్ష్మి
2.మనిషి కనబడుటలేదు (కవిత్వం)- శ్రీ గుడిమెట్ల చెన్నయ్య
3.సుమధుర పద్యమాలిక(ఖండకావ్యము)- శ్రీ ఉక్యం రమణయ్య.

గోరసం ప్రథమ వార్షికోత్సవ సభలో డొక్కాసీతమ్మ తల్లి పంచ ప్రక్రియల సంకలన ఆవిష్కరణ అనంతరం సమీక్షా సత్కారం

గోరసం ప్రథమ వార్షికోత్సవ సభలో డొక్కాసీతమ్మ తల్లి పంచ ప్రక్రియల సంకలన ఆవిష్కరణ అనంతరం సమీక్షా సత్కారం
Image may contain: 5 people, including గుడిపూడి రాధికారాణి and Yakkala Ranganayakulu, people standing

ఇష్టపదులు

Image may contain: text that says "ఇష్టపదులు -గుడిపూడి రాధికారాణి నిన్ను నీవు కూతురిగ భావించి కరములను జోడించి నీకు వందనము చేయాలి నేర్పి మోదమును చూపాలి నీవృద్ధిగాంచుచూ కలిగి నిలువెల్ల పొంగెదరు నటియించు వారలను అట్టిసత్పురుషులకు పసిగట్టి ఆదర్శ మూర్తులకు దూరముగ ఉంచుమా!"

వనపర్తిలో ఆవిష్కరింపబడిన **బతుకమ్మ మొగ్గలు** 1౦౦ మంది కవుల కవితాసంకలనంలో నా మొగ్గలు..ప్రక్రియ సృష్టికర్త. డా.భీంపల్లి శ్రీకాంత్

వనపర్తిలో ఆవిష్కరింపబడిన **బతుకమ్మ మొగ్గలు** 1౦౦ మంది కవుల కవితాసంకలనంలో నా మొగ్గలు..ప్రక్రియ సృష్టికర్త. డా.భీంపల్లి శ్రీకాంత్
Image may contain: text

ప్రపంచ తెలుగు రచయితల మహాసభలలో ప్రధానవేదిక నిర్వాహకురాలిగా

Image may contain: 3 people, including గుడిపూడి రాధికారాణి

(1.11.2019) మధ్యాహ్నం 1.30 ని.కు ఆకాశవాణి,విజయవాడలో నా ఇంటర్వ్యూ ఆటపాటలతో మనోవిజ్ఞానం

Image may contain: గుడిపూడి రాధికారాణి, standing and outdoor, text that says "ఆకాశవాణి విజయవాడ"

నవంబర్,2019 భావతరంగిణి మాసపత్రికలో ప్రచురితమైన నా మణిపూసలు.

నవంబర్,2019 భావతరంగిణి మాసపత్రికలో ప్రచురితమైన నా మణిపూసలు.
Image may contain: text that says "మణిపూసలు నవంబర్ సంచికలో "జీవన మకరందాలు' -గుడిపూడి రాధికారాణి, మచిలీపట్నం ప్రక్రియలు ఏవైనను పేరుకొరకు రాసిననూ గురజాడయె వందలుగా రాసినను కొరకు పోయెను రాశికన్న మొదటి నువు అయినట్టివే తెలిసిననూ సలహాలను ఓర్వలేరు అమ్ముకోకు కాలమందు సమాధాన పడనులేరు అభిమానం చంపుకోకు ఉత్తేజము జనులయందు ప్రయత్నమును విలువైనవి రచనలు కూడ్రా మరి ఏమాత్రము రాయకు చరితయందు వాక్యాన్నే స్పందించే హృదయముంది సులభం ఇది కాకున్నా పాదాలుగా విడగొట్టి నిలదీసే బాధ్యతుంది అసాధ్యమూ కాదన్నా ఇదో ప్రక్రియంటారు సమాజాన మార్పుతెచ్చు కవులంతా కవిత్వాన్ని నీ రచనకుంది ఒక వాక్యం రాశావా? చదివేవాడే లేడని మందిమదిని గెలిచావా? మారేవాడు ఉండడని మరలమరల మన నీయత్నము మానబోకు తలుచునట్లు చేశావా? చెప్పెయ్ రాత వీడనని"

(14.11.2019) ఈనాడు కృష్ణా సెంటర్ స్ప్రెడ్ లో బాలల దినోత్సవమ్ సందర్భంగా నా " బాల్యమెంత హాయికదా" మణిపూసలు ప్రచురితం .

(14.11.2019) ఈనాడు కృష్ణా సెంటర్ స్ప్రెడ్ లో బాలల దినోత్సవమ్ సందర్భంగా నా " బాల్యమెంత హాయికదా" మణిపూసలు ప్రచురితం .
**బాల్యమెంత హాయికదా!**
**మణిపూసలు**
గుడిపూడి రాధికారాణి.
కోయిలలా పాడినపుడు
నెమలిలాగ ఆడినపుడు
బాల్యమెంత హాయికదా!
కల్మషమే ఉండదపుడు (1)
నింగియంత మాదేనోయ్
గాలిపటాలెగరెయవోయ్
బాల్యమెంత హాయికదా!
గగనమంత సంబరమోయ్ (2)
వానలోన తడిశాము
ఎండలోన ఆడాము
బాల్యమెంత హాయికదా!
నిశ్చింతగ పెరిగాము (3)
పెద్దలనెదిరించలేదు
పిన్నల బెదిరించలేదు
బాల్యమెంత హాయికదా!
మూర్ఖత్వపు జాడలేదు (4)
చేతలో నిజాయితీ
కరుణ ఆనవాయితీ
బాల్యమెంత హాయికదా!
మనసుకాదే కోతీ (5)
గురువుచేత బెత్తము
లీడరుప్రతాపము
బాల్యమెంత హాయికదా!
దెబ్బకూడ మధురము (6)
పంచుకున్న తాయిలాలు
ఎంచుకున్న ఆశయాలు
బాల్యమెంత హాయికదా!
తలుచుకున్న జ్ఞాపకాలు (7)
విన్న దెయ్యాల కథలు
నాడు ఆడిన ఆటలు
బాల్యమెంత హాయికదా!
తలిస్తే పులకింతలు (8)
నేనే టీచరునైతే
పాఠశాల సెలవైతే
సెలవెంతో హాయికదా!
అపుడూ ఇపుడూ అంతే (9)
చిన్ననాటి అల్లరేది?
చిలిపితనపు సందడేది?
బాల్యమెంత హాయికదా!
తలపులలో మిగిలినదది (10)
బాల్యదశను దాటినా
వృద్దాప్యము చేరినా
బాల్యమెంత హాయికదా!
మనసు పసిగ మిగిలెనా (11)

(14.11.2019)ఈనాడు హాయ్ బుజ్జీ లో మా బడిపిల్లలు రాసిన కవితలు.

(14.11.2019)ఈనాడు హాయ్ బుజ్జీ లో మా బడిపిల్లలు రాసిన కవితలు..వారికి బాలలదినోత్సవ తాయిలంగా..ధన్యవాదాలు హాయ్ బుజ్జీ డెస్క్ కి.
Image may contain: text that says "ఆటలు కావాలి ఆడించే అమ్మమ్మ కావాలి పాటలు కావాలి పాడించే తాతయ్య కావాలి అలరి కావాలి చేయించే నేస్తం కావాలి కావాలి కథలా చెప్పే టీచర్ కావాలి దేవుడు కావాలి ప్రసాదం పెటే పూజారి కావాలి -పి. పావని, 7వ తరగతి, ಜಿ. గూడూరు,"
Image may contain: text that says "నాకేం కావాలంటే... అన్నంలోకి మంచి కూరలు ఆవరణ... తిట్టని కొట్టని పెద్దలు రోజుకో కథ చెప్పే బామ్మ... ఇవన్నీ చెయ్యగలగడానికి కావాల్సినంత సమయం -బద్రి, ไవ తరగతి, ఉన్నత పారశాల, గూడూరు"
Image may contain: text that says "జెర్రీతో చేసే టామ్ని చూస్తానా? తెలియని చిలకల్ని చూస్తానా? ప్రమాదాలు జరగని రహదారిని చూస్తానా? అవమానం జరగని సమాజాన్ని చూస్తానా? చదివించే కార్పొరేట్ బడిని చూస్తానా? 9వ తరగతి, గూడూరు"
Image may contain: text that says "తాతగారి అనుభవాలు వినడమిష్టం బామ్మచెప్పే అమ్మ పెట్టే అప్పచ్చులింకా ఇష్టం నాన్నతో తీరిగా గడపడమిష్టం కానీ... వాళ్ల చేతుల్లో ఫోన్ ఉంటే ఇవన్నీ కష్టం వెన్నెల, ไవ తరగతి"
Image may contain: text that says "కొండనైన పిండి చేసే కండలు నాకు కావాలి చేతనైన సాయం చేసే శక్తి నాకు కావాలి తల్లిదండ్రుల తపన గెలుపు నాకు కావాలి ఇవన్నీ కావాలంటే దురలవాట్లకు లోనుకాని నాకు కావాలి -ఎం. సాయిసంతోష్, 10వ తరగతి, గూడూరు"
Image may contain: text that says "అందలాలు ఎక్కించే అవకాశం రావాలని ఒక్కపట్టు పట్టాలని ఒక్కోమెట్టు ఎక్కాలని అడ్డంకులు దాటాలని గెంటాలని నా శక్తిని చూపాలని కృషితోనే విజియమని నేను నమ్ముతున్నానని... ప్రసన్న, ఎం. జ్యోతిక, 10వ తరగతి, గూడూరు"
No photo description available.


*రుద్రారం శ్రీనివాసులు రెడ్డిగారి స్మృతి గజల్**

**రుద్రారం శ్రీనివాసులు రెడ్డిగారి స్మృతి ముషాయిరా గజల్**
గజలు మహలున భావములు కలబోసుకొంటిని సోదరా!
అక్షర వనపు స్నేహసుమములు ఏరుకొంటిని సోదరా!
మొన్న నిన్నై నిన్న నేడై నిలిచిపోయెను ఎందుకో
కాలచక్రపు జ్ఞాపకాలను తవ్వుకొంటిని సోదరా!
గగనమందున తార నీవై వెలిగిపోవుట కంటినోయ్
చీకటింటిన కాంతిగంధము పూసుకొంటిని సోదరా!
చినుకు రాలిన సందడినిగని నిన్నుతలచితి మిత్రమా!
వానవలె నీ షేర్లు కురవగ మురుసుకొంటిని సోదరా!!
ఓర్మితో నా గజలు చదువుచు మెచ్చుకొంటిరి గతములో
పేర్మితో మీ గజలునొక్కటి పాడుకొంటిని సోదరా!
కాలమెంతటి కఠినమైనది గండ్రశిలయే నయముగా
మరచుటెంతటి కష్టమోయని ఒప్పుకొంటిని సోదరా!
నేడు మిమ్ముల తలచుకొంటిమి రేపు నా గతి ఏమిటో!
రాధికగ నను తలచుకొమ్మని కోరుకొంటిని సోదరా!!
********************************************
గుడిపూడి రాధికారాణి(5.9.2019)

కాళోజీ రాష్ట్రస్థాయి సాహితీ పురస్కారం

(9.9.2019) తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో కాళోజీ 105 వ జయంతి మరియు తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా కళాశ్రీ సాహితీ వేదిక ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ శ్రీ రాజేశం ,సంస్థ అధిపతి శ్రీ గుండేటి రాజు, కార్యక్రమ కమిటీ చైర్మన్ శ్రీ శైలజా రెడ్డి ల చేతుల మీదుగా " కాళోజీ రాష్ట్రస్థాయి సాహితీ పురస్కారం " అందుకున్నాను ..

(సెప్టెంబర్,2019) భావతరంగిణి మాసపత్రికలో నా సమీక్షలు.

(సెప్టెంబర్,2019) భావతరంగిణి మాసపత్రికలో నా సమీక్షలు.
శ్రీ దగ్గుమాటి పద్మాకర్ గారి అద్భుత కథా సంపుటి "ఈస్తటిక్ స్పేస్"
గోరసం అధ్యక్షులు శిష్టు సత్యరాజేష్ సంపాదకత్వంలో మహిళాభ్యుదయ సంకలనం(వచన కవిత్వం)
No photo description available.

ఇష్టపదులు ప్రక్రియలో పలుమార్లు వారాంతపు విజేతగా.

డా.బృందావనం ధన్వంతరాచార్యులుగారికి శ్రీ మద్వైఖానస మహామండలి,మచిలీపట్నం శాఖ వారి విశిష్ట పురస్కార సందర్భమున నేను రచించిన 9 ఆటవెలదుల పద్యకుసుమాంజలి ..

డా.బృందావనం ధన్వంతరాచార్యులుగారికి
శ్రీ మద్వైఖానస మహామండలి,మచిలీపట్నం శాఖ వారి విశిష్ట పురస్కార సందర్భమున నేను రచించిన 9 ఆటవెలదుల పద్యకుసుమాంజలి ..
ఆ.వె.
ధరణియందునపర ధన్వంతరియె వీరు
నేత్ర వైద్యరంగ నిపుణులైరి
సున్నితమగు వాక్కు సునిశితమగు చూపు
కన్నులందు కలదు కాంతిరేఖ (1)
నడతనేర్ప తండ్రి నారాయణాచార్య
నిలుపుకొనిరి యశము నిరవతముగ
అనఘ దత్తపీఠ ఆస్థాన విద్వాను
దత్తకృపను పొంది దండిగాను (2)
హితముకోరి నడిపె హిందూకళాశాల
పెక్కుసంస్థలున్ను పేర్మితోడ
విఖనసమ్మునందు వీరి సేవలుజూడ
బందరందు జనుల బంధువైరి (3)
ఆంజనేయ స్వామి ఆలయమ్మును కట్టి
మహతి వేదికగను మలచినారు
హాస్యలహరి సంస్థ హసనాల రాజుగా
నవ్వు రోగములనునణచుననిరి (4)
సాహితీ సభలన సంభాషణల మేటి
ధారణమ్ములోన ధాటిజూపి
అక్షరాల సృజన అలవోకగాజేసి
పరులు మెచ్చునట్టి పథమునందె (5)
గువ్వలా ఒదిగెను గూడూరు గుండెలో
స్వంతవూరివారు సంతసించ
సద్దుచేయకుండ చాటింపు లేకుండ
వితరణలనుజేయు వినయశీలి (6)
వైద్యవృత్తిలోన వైశిష్ఠ్యమును జూపి
సజ్జనుడిగ మసలు సౌమ్యశీలి
కేతనమెగరేయ కేశవకృష్ణుండు
పుత్రవృద్దిగాంచి పొంగినారు (7)
వంశ వ్యాప్తి కొరకు వసుధను గాలించి
కోరి తెచ్చుకొనిరి కోడలిగను
సహనదేవతంద్రు శైలజమ్మను కూడ
సుదతియామె వాక్కు సుధలు చిలుకు (8)
శతము దాటిపోయి సంతోషకరముగ
గడపవలయు మీరు ఘనముగాను
రమయె తోడుయైన రమణీయజంటగా
వినయవందనాలు వేలవేలు (9)
***************************
కలం మరియు గళం :గుడిపూడి రాధికారాణి.
15.8.2019.
శ్రీమద్వైఖానస మహామండలి మచిలీపట్నం శాఖ.
Image may contain: 3 people, including గుడిపూడి రాధికారాణి, people standing and people sitting
Image may contain: Vidadala Sambasivarao

తెలుగు భాషాదినోత్సవ సందర్భంగా...2019

7.7.2019) హైదరాబాద్ రవీంద్రభారతి లో ఆవిష్కరింపబడిన "వరకవి సిద్ధప్ప స్మారక కవితా సంకలనం" లో ప్రచురితమైన నా పద్యాలు ..

7.7.2019) హైదరాబాద్ రవీంద్రభారతి లో ఆవిష్కరింపబడిన "వరకవి సిద్ధప్ప స్మారక కవితా సంకలనం" లో ప్రచురితమైన నా పద్యాలు ..
**కనుమరుగవుతున్న కులవృత్తులు** ( ఆటవెలదులు)
ఆ.వె. 1.
పల్లె పదము పాట పాడు ముచ్చటగను
గొర్రె మేక కాయు గొల్ల కురుమ
కర్ర పట్టి నడిపి కాపలా కాసేరు
నేడు కానరారు నెపమెవరిది?
ఆ.వె.2
బట్టలుతక మరలు-బాదే పనేదిక?
బండనేసి బాది బాది తెచ్చు
రజకులకిక కరువురా బతుకుతెరువు
గాడి దప్ప జనులు గాడిదేడ్చె
ఆ.వె.3
గంగిరెద్దు ఆట గారడీ విద్యలు
తోలుబొమ్మలాట తొలగిపోయె
లలితములగు బుట్టలల్లు వారేరిర?
కూలిపనికి మారి కుమిలిపోయె
ఆ.వె.4
మట్టిపాత్రలేవి? మరుగున పడినవి
జనులు ప్లాస్టికనుచు జపము చేయ
కొత్తకుండ నీరు కోరినా దొరకవు
కుములు కాలమొచ్చె కుమ్మరులకు
-------------------------
గుడిపూడి రాధికారాణి
Image may contain: 1 person
Image may contain: text that says "శ్రీశ్రీశ్రీ వరకవి స్మారక కవితా సంకలనం తెలుగు భాషా చైతన్న సమితి 17. కులవృత్తుల కనుమరుగు పల్లె పదము పాట పాడు ముచ్చటగను గొరె మేక కాయు గొల్ల కురుమ కర్ర పట్టి నడిపి కాపలా కాసేరు నేడు కానరారు నెపమెవరిది? బట్టలుతక మరలు బాదే పనేదిక? బండనేసి బాది బాది తెచ్చు రజకులకిక కరువురా బతుకుతెరువు గాడి దప్ప జనులు గంగిరెద్దు ఆట గారడీ విద్యలు తోలుబొమ్మలాట తొలగిపోయె లలితములగు బుట్టలల్లు వారేరిర? కూలిపనికి మారి కుమిలిపోయె మరుగున పడినవి జనులు జపము చేయ కొత్తకుండ నీరు కోరినా దొరకవు కుములు కుమ్మరులకు గుడిపూడి రాధికారాణి మచిలీపట్నం 9494942583"

(31.7.2019) గోదావరి దినపత్రికలో నా గజల్ "**మట్టిలో** ప్రచురితం

Image may contain: గుడిపూడి రాధికారాణి, smiling, text

కైతికాలు ప్రక్రియ ప్రథమ సంకలనంలో నా కైతికాలు "నిదురెంతో హాయి కదా!" ప్రచురితం.


తొలివలపే తీయనౌను
మధురోహలు ముంచుకొచ్చు
భవితకొరకు కలలు కనగ
బాధ్యతలే తరుముకొచ్చు
నిదురెంతో   హాయికదా!
కలల అలల తేలియాడ  

అలసటనే అణచివేయ
అసలుసిసలు ఔషధమిది
సత్తువ సమకూరుటకే
సమయమిచ్చు నేస్తమిది
నిదురెంతో హాయికదా!
సేదదీరు దారికదా ! 

నిదురలోన కన్నకలలు
మెలకువతో మరపుకొచ్చు
భయమేదో తరిమిననూ
మరల నిదుర ముంచుకొచ్చు
నిదురెంతో హాయికదా!
కలల అలల తేనె ఊట  


శ్రీ వెంకటేశ్వర వెభవం లో నా కవిత "శ్రీవారికొక లేఖా కుసుమం "



రవీంద్రభారతిలో తెలుగు భాషా చైతన్య సమితి వారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర వెభవం పుస్తకావిష్కరణ కార్యక్రమం మఱియు కవిసమ్మేళనము జరిగింది. అందులో నా కవిత "శ్రీవారికొక లేఖా కుసుమం " ప్రచురితమయింది.
శ్రీవారి పాదపద్మముల చెంతకొక లేఖా కుసుమం..
***********************************
ధరలను ధరణిని దాటనీకుమా ధరణీనాయకా!
అతివకు ఆదరణ అందనీయుమా వజ్రకవచధారీ!

బాలల అపహరణ అడ్డుకోవయా ఆపన్నివారణా!
అవయవాల తస్కరణ ఆపవయా అనాధరక్షకా!

నరులను తరువుల నరకనీకుమా తులసీవనమాలీ!
నీటిబొట్టుకై కన్నీటిబొట్టు విడువనీకు నీలమేఘశ్యామా!

కాలుష్యకోరలను పెకలించి మము కావుమా కరుణాసాగరా!
మానవులలో దానవతను దునుమాడుమా దశముఖ మర్దనా!

కావరము కలవారి కన్నులను తెరిపించు కమల దళాక్షా!
తాతబామ్మలతోటి తిరిగేటి వరమొసగు తిరుమలవాసా!

బతుకులో యాంత్రికతను ఇకనైన తొలగించు బ్రహ్మాండ రూపా!
వసుధలో వసంతమే వాడిపోనీకయా వసుదేవతనయా!

మనిషిలో మమతలే మాసిపోనీకయా మత్స్యావతారా!
అక్షరమె సుమముగా అర్చించినానయా ఆద్యంతరహితా!

అందరికి అండవై ఆదుకొనరావయా అభయహస్త ప్రదర్శకా!
దీనులకు దీపమై బాధితుల బాసటగు పరమదయాళో!

శేషమగు జీవితమె శాంతముగ సాగనీ శేషాద్రినిలయా!
*******************
గుడిపూడి రాధికారాణి,
మచిలీపట్నం,కృష్ణాజిల్లా.
No photo description available.

అమ్మ నాన్న ఓ కవిత సంకలనం లో ప్రచురితం .



మార్గదర్శి మా నాన్న**
-గుడిపూడి రాధికారాణి.మచిలీపట్నం.
*******************************************
మళ్ళీ ఆడపిల్లేనా?
మూకంతా మూతి విరిచినా
మూర్ఖించకుండా మురిసిపోయింది
మానాన్నొక్కడే
పొత్తిళ్ళలో పసిగుడ్డుగా
పొదివిపట్టుకోవడం చేతకాక
తన వేలును నా గుప్పిట్లో దూర్చి
తనివితీరా నన్నుచూసి
కళ్ళలో కాంతులు నింపుకుని
తన చేతిస్పర్శ నా మనసుకు తెలిసేలా
నా భవితకు భరోసానీ,భద్రతనీ
ఆర్ద్రంగా వర్షించిన కారుణ్య మేఘం...మా నాన్న.
నాలుగో ఏటనే నాకు చదవటం నేర్పేసి
తన పెళ్ళినాటి నుండి కొనిదాచిన
చందమామల్ని నేను చదివేస్తుంటే
ముద్ద ముట్టక్కర్లేదిక అని
మురిసిపోయిన మెరుపుతునక...మా నాన్న.
ఎడమచేత్తో రాసే నన్ను
పురచేతివాటం అని అంతా హేళన చేస్తుంటే
గెలిచిన రోజు ఈ సమాజమే
నీ సంతకం కోసం చేయి చాపుతుందని
ఊరడించిన మార్గదర్శి...మా నాన్న.
ఆనాడు నా ముద్దుమాటలకు,ముత్యాలరాతకు
నాన్న మురిసిపోవడం నాకు గుర్తులేదు.
ఈనాడు నా ప్రసంగాలు,సాహితీ ఉన్నతులు
చూపి మురిసిపోదామంటే నాన్న లేరు.
అయితేనేం...నా రచనలకు
మీ చప్పట్లతో నాన్న నా వీపు తట్టినట్లు
మీ మెచ్చుకోళ్ళలో నాన్న కళ్ళు మెరిసినట్లు
ఇప్పటికీ నాన్న వేలుని నా గుప్పిట్లో పదిలంగా పట్టుకున్నట్లు
ఆ ఊహయే నా కలమును కదిలించేస్తున్నట్లు...
అంతే మరి...
భావనలే కదా బతుకు బండి ఇంధనాలు...
******************************************
అమ్మ నాన్న ఓ కవిత సంకలనం లో ప్రచురితం .
I LoVE YOU నాన్న ..I MISS YOU..

12, మార్చి 2020, గురువారం

నా సమీక్షలు..ఏప్రిల్,2019 భావతరంగిణి మాసపత్రికలో .. 1.కైత: శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి. 2.ప్రళయం: శ్రీ చలపాక ప్రకాష్.

నా సమీక్షలు..ఏప్రిల్,2019 భావతరంగిణి మాసపత్రికలో ..
1.కైత: శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి.
2.ప్రళయం: శ్రీ చలపాక ప్రకాష్.
No photo description available.

(మే,2019) భావతరంగిణి మాసపత్రికలో నా సమీక్షలు: 1.చౌరస్తాలో సముద్రం(కవిత్వం)-శ్రీ సంగెవేని రవీంద్ర. 2.మధుమాలిక(కథలు)-ఉప్పలూరి మధుపత్ర శైలజ. 3.పూనాలో పూచిన నానీలు- శ్రీమతి సీతాసుధాకర్.

(మే,2019) భావతరంగిణి మాసపత్రికలో నా సమీక్షలు:
1.చౌరస్తాలో సముద్రం(కవిత్వం)-శ్రీ సంగెవేని రవీంద్ర.
2.మధుమాలిక(కథలు)-ఉప్పలూరి మధుపత్ర శైలజ.
3.పూనాలో పూచిన నానీలు- శ్రీమతి సీతాసుధాకర్.
No photo description available.

కృష్ణా జిల్లా సాంస్కృతిక శాఖ వారి వికారినామ ఉగాది వేడుకలకు చెందిన పేపర్ క్లిప్స్ ..వరుసగా ఆంధ్రజ్యోతి,భూమి,ప్రభ,ఈనాడు.

Image may contain: 3 people, including గుడిపూడి రాధికారాణి, people standing and textImage may contain: one or more people and people standing, text that says "രA నడుకక మది కృష్ణాజిల్లా ఉగాది వేడుకల్లో మాట్లాడుతున్న డీఆర్డ ప్రసాద్ సంప్పతి, సంప్దాయాలకు పతీక ఉగాది' వికార నామ సంవత్సరాది వేడుకల్లో డీఆర్‌ಓీ ప్రసాద్"

(14.4.2019) గోదావరి దినపత్రికలో నా కవిత .." అసలేమనుకున్నావు? "

(14.4.2019) గోదావరి దినపత్రికలో నా కవిత .." అసలేమనుకున్నావు? "
Image may contain: గుడిపూడి రాధికారాణి, smiling, text that says "ఆదివారం ఏప్రిల్ 14, 2019 అసలేమనుకున్నావు? నీడననుకున్నావ నీ మండిపాటు నడినెత్తికెక్కితే మాయం అవడానికి చీడననుకున్నావా? బూతుపదాలు ప్రయోగించి తలెత్తకుండా చేయడానికి క్రీడననుకున్నావా? తోచిన పయోగాలతో నన్ను శిధిలం చేయడానికి పీడననుకున్నావా? కిరోసిన్ తోనో యాసిడ్ తోనో అంతం చేయబూనడానికి గోడననుకున్నావా? నీ అవినీతి కోటను కాచేందుకు దాచేందుకు ఆడబొమ్మననుకున్నావా? ఆదమరిచి ఆబగా ఆడి నాశనం చేసేందుకు నిన్ను కన్న అమ్మనిరా.. పసిపాపలో కూడ అమ్మనే చూడు తప్పు చేశావని తెలిస్తే తల్లినైనా తలారినే కాగలను ఖబడ్దార్!!! గుడిపూడి రాధికారాణి, రాధికారాణి, మచిలీపట్నం."

14.4.2019 ఉగాదివెలుగు పురస్కృతి - సాంస్కృతీ సమాఖ్య ,విజయవాడ లో కవితాదర్బార్ .

(16.3.2019) గోరసం అధ్యక్షుడు శిష్టు సత్య రాజేష్ సారధ్యం వహించిన "మహిళాభ్యుదయం" 70 మంది కవుల కవితాసంకలనంలో నా కవిత.."ప్రేమ స్వరూపిణి."



*ప్రేమస్వరూపిణి**
************
ఎడారి ఎండలో ఎండమావి అని ఎండి అతడుంటే
వానచినుకై ఒయాసిస్సు ఒడ్డున చెట్టై ఆమె..
విశాలవిశ్వంలో ఒంటరై విస్తుపోతూ అతడుంటే
నీడై తోడై హస్తమొదలని నేస్తమై ఆమె..
జనారణ్యంలో జవసత్వాలుడిగి అతడుంటే
నగయై నగవై నవచైతన్యపు నవ్యనాదమై ఆమె..
బాధ్యతలకు బందీయై ఉక్కిరిబిక్కిరై అతడుంటే
ఊపిరై ఊతమై ఉత్సాహపు ఉనికియై ఆమె..
వసంతమే కానరాని శిశిరంలో అతడుంటే
వానవిల్లై వర్ణమయమై ఎదన వల్లరియై ఆమె..
ఓటమిబాటన హతాశుడై చతికిలబడి అతడుంటే
ఒంట్లో ఓపికై విజయానికి బాటయై బాసటై ఆమె..
అవును...ఆమె లేనిదే అతడు లేడు
అందుకే...
ఆడపిల్లని ఆదరించే, గౌరవించేవాడు
మంచివాడో గొప్పవాడో కాదు
అవనిలోన అదృష్టవంతుడు.
-------------------------------------------
గుడిపూడి రాధికారాణి,మచిలీపట్నం.
Image may contain: text

ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 21.3.2019న ప్రపంచ కవితాదినోత్సవ పురస్కారయుత సత్కారం .

ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో 21.3.2019న ప్రపంచ కవితాదినోత్సవ పురస్కారయుత సత్కారం .
Image may contain: 2 people, including గుడిపూడి రాధికారాణి, people standing

(27.3.2019) ఈనాడులో ప్రచురితమైన నా కవిత ..."" ఓటనేది..."

Image may contain: text that says "ఈనాడు ఓటనేది నీ కష్టారితపు ఆస్తికాదు ఓటనేది ఇష్చమొచ్చినంతకి అమ్ముకోవడానికి ఓటనేది నువ్వుచేసిన అపుకాదు మొహంచాటేసి ఎగ్గట్టడానికి ఓటనేది 2ိ మొక్కుబడిగ మర్యాదచేసి మరిచిపోవడానికి ఓటనేది పెద్దలనుంచి హక్కుకాదు కులమతాల గీతలు గీసుకోవడానికి � ఓటనేది ఆయాచితంగా లభించిన ఆయుధంకాదు విచక్షణ మరిచి యధేచ్చగా వినియోగించడానికి ఓటనేది నీవయను చూపాచ్చిన వలవువంట కాదు అన్నీ తెలుసని ఏమైనా చేయొచ్చని వర్వీగడానికి ఓటనేది నీ దేశం నీకిచ్చిన ఒక ఆవకాశం రచయిత్రి, గుడిపూడి రాధికారాణి -గొడుగుపేట (మచిలీపట్నం) న్యూస్‌టుడే Date 27/03/2019 EditionName ANDHRA PRADESH KRISHNA PageNo Page 13"

ఉయ్యూరు,క్రృష్ణా జిల్లా సరసభారతి సంస్థ ఉగాది కవిసమ్మేళనం నిర్వాహకురాలిగా స్త్రీ శక్తి అంశంపై ..నా కవిత వినిపిస్తూ ..(2019)

Image may contain: Putti Nagalakshmi, గుడిపూడి రాధికారాణి and Durga Prasad Gabbita, people standing

"అవినీతిపై అక్షరాయుధం " 63మంది కవితల సంకలనంలో 50వ పేజీలో నా కవిత.."ఒక్కసారి ఆలోచించు".

**ఒక్కసారి ఆలోచించు.**
*********************
అవినీతి అలుముకుందనీ,దేశమిలా నాశనమైందనీ
దిగులుపడేముందు ఒక్కసారి ఆలోచించు!
దుడ్డు ఇవ్వనిదే బొడ్డు కోయదనీ,
పైసలివ్వందే పాడె కట్టడనీ,
రొక్కమివ్వందే లెక్క తేల్చరనీ,
సంతోషపెట్టందే సంతకం పెట్టరనీ
సణిగే,గొణిగేముందు ఒక్కసారి ఆలోచించు!
పేవ్ మెంట్ మీద పడతి పెనుగులాటని
వాట్సాప్లో పెట్టాలని ఉరకలెత్తేముందు,
అవబోయే అనర్ధమేదో ఒక్కసారిగా ఆగిపోతే
రోజంతా నంజుకోవడానికి మసాలా మిస్సయిందని
నిరాశ చెందేముందు ఒక్కసారి ఆలోచించు!
చంపుకున్న చుట్టాల్నీ,నీచపు చేతల్నీ,
కీచక గురువుల్నీ,మృగ్యమయే మానవతనీ
వార్తలంటే ఇంతేననుకునేలా
రోజంతా చూపిస్తుంటే
మసాలా టీ తాగుతూ దేశమిక మారదంటూ
నిట్టూర్పుల స్టేట్మెంట్లిచ్చేముందు ఒక్కసారి ఆలోచించు!
చేరదీసి చక్కని పౌరులుగా దిద్దే గురువులను,
కసురుకోక విసుగులేక విధులు చేసే ఉద్యోగుల్నీ,
స్ఫూర్తినిచ్చే ఆవిష్కరణల చిన్నారులనీ,
నీతినలా బతికుంచే నిజాయితీపరుల్నీ
బ్రేకింగ్ న్యూస్ గా ఎందుకు చూపరో ఒక్కసారి ఆలోచించు!
సానుకూల విషయాలే మన కబుర్ల విత్తులయితే
అంతటా అనుకూలమైన అభివృద్ది వృక్షచ్చాయన
ఎల్లరం చల్లగా నిలువగలమని... ఒక్కసారి నమ్మి చూడు!
************************************************************
గుదిపూడి రాధికారాణి,
మచిలీపట్నం.
No photo description available.

నా **గజల్** రచనకు లభించిన మరో అందమైన గుర్తింపు .."కలహంస పురస్కారం."(17.2.2019)

No photo description available.