16, మార్చి 2020, సోమవారం

(14.11.2019) ఈనాడు కృష్ణా సెంటర్ స్ప్రెడ్ లో బాలల దినోత్సవమ్ సందర్భంగా నా " బాల్యమెంత హాయికదా" మణిపూసలు ప్రచురితం .

(14.11.2019) ఈనాడు కృష్ణా సెంటర్ స్ప్రెడ్ లో బాలల దినోత్సవమ్ సందర్భంగా నా " బాల్యమెంత హాయికదా" మణిపూసలు ప్రచురితం .
**బాల్యమెంత హాయికదా!**
**మణిపూసలు**
గుడిపూడి రాధికారాణి.
కోయిలలా పాడినపుడు
నెమలిలాగ ఆడినపుడు
బాల్యమెంత హాయికదా!
కల్మషమే ఉండదపుడు (1)
నింగియంత మాదేనోయ్
గాలిపటాలెగరెయవోయ్
బాల్యమెంత హాయికదా!
గగనమంత సంబరమోయ్ (2)
వానలోన తడిశాము
ఎండలోన ఆడాము
బాల్యమెంత హాయికదా!
నిశ్చింతగ పెరిగాము (3)
పెద్దలనెదిరించలేదు
పిన్నల బెదిరించలేదు
బాల్యమెంత హాయికదా!
మూర్ఖత్వపు జాడలేదు (4)
చేతలో నిజాయితీ
కరుణ ఆనవాయితీ
బాల్యమెంత హాయికదా!
మనసుకాదే కోతీ (5)
గురువుచేత బెత్తము
లీడరుప్రతాపము
బాల్యమెంత హాయికదా!
దెబ్బకూడ మధురము (6)
పంచుకున్న తాయిలాలు
ఎంచుకున్న ఆశయాలు
బాల్యమెంత హాయికదా!
తలుచుకున్న జ్ఞాపకాలు (7)
విన్న దెయ్యాల కథలు
నాడు ఆడిన ఆటలు
బాల్యమెంత హాయికదా!
తలిస్తే పులకింతలు (8)
నేనే టీచరునైతే
పాఠశాల సెలవైతే
సెలవెంతో హాయికదా!
అపుడూ ఇపుడూ అంతే (9)
చిన్ననాటి అల్లరేది?
చిలిపితనపు సందడేది?
బాల్యమెంత హాయికదా!
తలపులలో మిగిలినదది (10)
బాల్యదశను దాటినా
వృద్దాప్యము చేరినా
బాల్యమెంత హాయికదా!
మనసు పసిగ మిగిలెనా (11)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి