30, జులై 2016, శనివారం

సంతోషాన్ని మీతో పంచుకోవాలని....

మిత్రులారా! ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ వారు త్వరలో ఆవిష్కరించనున్న పుష్కర ప్రత్యేక సంచిక.."కృష్ణా తీరం" లో నా వ్యాసం.."బందరులో బ్రౌన్ భాషా సేవలు" ప్రచురింపబడనున్నది.ఈ సంతోషాన్ని మీతో పంచుకోవాలని....
అంతేకాదు మిత్రులారా! ఉగాది తర్వాత మరల నేను దూరదర్శన్ లో పుష్కరాల సందర్భంగా కవిసమ్మేళనం లో పాల్గొన్నాను.సప్తగిరి దూర్ దర్శన్ వారు 20-07-2016 న కృష్ణాపుష్కర వైభవం 2016 పేరుతో డా.జి.వి.పూర్ణచంద్  అధ్యక్షతన ఒక కవిసమ్మేళనం నిర్వహించారు. ఇందులో పాల్గొన్న ప్రముఖ కవులు ఎడమనుండి శ్రీ యంపి. జానుకవి,డా. జంధ్యాల పరదేశిబాబు, శ్రీ సి హెచ్ వి బృందావనరావు, శ్రీ యలమర్తి రమణయ్య, శ్రీ పింగళి వెంకట కృష్ణారావు, శ్రీమతి గుడిపూడి రాధికారాణి(నేను), డా. పాలపర్తి శ్యామలానంద ప్రసాద్, డా.జి.వి.పూర్ణచంద్, శ్రీ శిఖా ఆకాష్, కవి కరీముల్లా , డా. పాపినేని శివశంకర్, శ్రీమతి పుట్టి నాగలక్ష్మి, శ్రీ అజ్మీర్ వీరభద్రయ్య, డా. భూసురపల్లి వెంకటేశ్వర్లు, డా. రావి రంగారావు ఈ కవిసమ్మేళనంలో పాల్గొన్నారు
ఎందరో లబ్దప్రతిష్టులమధ్య నాకు స్థానం లభించడం నాకు ఎంతో ఆనందాన్నిస్తోంది.నాకు ఈ అవకాశం ఇచ్చిన కృష్ణాజిల్లా రచయితల సంఘం శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారు,డా.జి.వి.పూర్ణచంద్ గార్లకు నమస్సుమాంజలులు.

28, జులై 2016, గురువారం

కవిత...* " ఆకాంక్ష. " *

తెలుగు విద్యార్ధి-జులై,2016 సంచికలో నా గేయం..* " ఆకాంక్ష. " * నాకు నచ్చిన రచన..ఉగాది నాడు వ్రాసినది. మీ  అభిప్రాయం ఆశిస్తూ..మీ కోసం.


24, జులై 2016, ఆదివారం

నా సమీక్ష

ఈరోజు(24/7/2016) రచయిత్రి శ్రీమతి వాడవల్లి విజయ లక్ష్మి గారి స్వర్ణోత్సవ సంచిక ఆవిష్కరణ వేడుక జరిగింది.ఇండియన్ కల్చరల్ అసోసియేషన్(భవిష్య గారు) నిర్వహణ లో జరిగిన సభకు కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారు అధ్యక్షత వహించగా శ్రీ కొల్లు రవీంద్ర,శ్రీ ఆర్.వి.ఎస్.రాజు గారు, డా.మాదిరాజు రామలింగేశ్వర రావు,శ్రీ సవరం వెంకటేశ్వరరావు తదితరులు ప్రసంగించారు. బాలసాహిత్య రచయిత్రి,వ్యాసకర్త,ఆధ్యాత్మిక పుస్తక,కథా,నవలా రచయిత్రి వాడవల్లి గారు "అనంతానంద శిఖరము" అనే ఒక ఆధ్యాత్మిక పుస్తకం రచించియున్నారు.ఆ పుస్తకము పై నా సమీక్ష స్వర్ణోత్సవ సంచికలో చోటు చేసుకుంది.


20, జులై 2016, బుధవారం

దుర్ముఖి నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఉయ్యూరు సరసభారతి (శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్) వారు నిర్వహించిన "మా అన్నయ్య"కవి సమ్మేళనం లో ని కవితా సంకలనం లో నా కవిత..

దుర్ముఖి నామ సంవత్సర ఉగాది సందర్భంగా ఉయ్యూరు సరసభారతి (శ్రీ గబ్బిట దుర్గా ప్రసాద్) వారు నిర్వహించిన "మా అన్నయ్య" కవిసమ్మేళనం లో 35 కవితల సంకలనం ఆవిష్కరింపబడింది.అందులో నా కవిత..ఆవిష్కరణ సమయం లో నేను చెన్నై లో ఉండి రాలేకున్నా  2 పుస్తకాలు ఇంటికి పోస్ట్ లో పంపిన శ్రీ గబ్బిట దుర్గాప్రసాద్ గారికి ధన్యవాదాలు.

9, జులై 2016, శనివారం

ఈనాటి (9,జులై,2016) ఈనాడు హాయ్ బుజ్జీ లో నా 56వ కథ.."కాకి కనువిప్పు."

ఈనాటి (9,జులై,2016) ఈనాడు హాయ్ బుజ్జీ లో నా కథ.."కాకి కనువిప్పు."
అందరిలో ఒకలా ఒంటరిగా ఉన్నపుడు ఒకలా ఉంటారు కొందరు...అవసరం ఉన్నపుడు ఒకలా అవసరం లేనపుడు ఒకలా ఉంటారు ఇంకొందరు..ఎదుటివారికి ఉనికినిస్తే తమ విలువ తగ్గిపోతుందని అనుమానిస్తారు మరికొందరు..