16, జనవరి 2016, శనివారం

శుభవార్త..2016 జనవరి 29న నాకు సాహితీ పురస్కార ప్రదానం జరగనుంది.సంతోషంగా ఉంది..కానీ..ఏదో అంతర్మధనం..సమీక్షలు,ఉపన్యాసాలు ఎక్కువైన కొద్దీ బాలసాహిత్యానికి దూరమవుతున్నానా??నాకు అవీ,ఇవీ కూడా ఆనందాన్నిస్తున్నాయి మరి..గణితబోధన..10వ తరగతి పిల్లల పరీక్షల సమయం..పెరుగుతున్న ఒత్తిడి ని జయించలేకపోతున్నానా?? సమయపాలన తెలియడంలేదా?ఏది ఏమైనా..పిల్లల కథలకు ఈ క్షణం నుండే మరింత ప్రాధాన్యత ఇవ్వవలసిందే..ఏమంటారు?


14, జనవరి 2016, గురువారం

ఈ రోజు నాన్న పుట్టిన రోజు..2012 లో ఎండదెబ్బ వలన మమ్ము వదిలి వెళ్ళిన నాన్న ఈ రోజుకి ఎక్కడో పుట్టే ఉంటారు...కదూ..


అద్దేపల్లి రామమోహన రావు గారి మరణ వార్త..నిరాశ కు నిర్వచనం నాకు తెలిపింది. 5వ ఏట నుండి చందమామలు చదివించే నాన్న 6వ తరగతిలో తను ఎప్పటినుండో దాచి ఉంచిన ఒక కవితల పుస్తకం(1969 లో ముద్రణ) నాకు ఇచ్చి "ఇన్నాళ్ళూ కిటికీ లోనుండి నువ్వు లోకాన్ని చూశావు..ఇటువంటి పుస్తకాలు చదవడం వల్ల తలుపు తెరుచుకుని వెళతావు."అన్నారు.ఆ పుస్తకం లో గబ్బిట దుర్గాప్రసాద్,స్వర్ణరాజ హనుమంత రావు మొ..ఎందరివో అద్భుతమైన కవితలు ఉన్నాయి. ఎన్ని సార్లు చదివానో..చెప్పలేను బతికుండగా అద్దేపల్లి ని కలవాలని ఆశ పడి నిరాశ మిగిలిన బాధతో.....