అక్క పెళ్ళి కుదిరింది.నేను ఇంటర్లో ఉన్నా.గుడివాడలో మా ఇంటికి అతి సమీపంలో (నడక దూరంలో అన్నమాట) టి.టి.డి.కళ్యాణ మండపం కట్టిన కొత్తలు అవి.అప్పటికి అందులో రెండు పెళ్ళిళ్ళే అయ్యాయి.అంత కొత్త అన్నమాట.పోన్లే ఆడపిల్లలు పెళ్ళీడు కి వచ్చేసరికి ఇంటి దగ్గర్లో కళ్యాణ మండపం అమరింది అని అమ్మ మురిసిపోయేది.పెళ్ళి ముహూర్తం ఖరారు చేసినట్లుగా కబురు తెలిసింది.నాన్న భోజనం చేస్తున్నారు.పెరుగు అన్నం కలుపుకుంటుండగా అమ్మ ఉత్తరంతో వచ్చి పెళ్ళి తేదీ ఖరారు అయినట్లుగా చెప్పింది. వెంటనే నాన్న లేచి చెయ్యి కడిగేసుకుంటూ..నన్ను చొక్కా తెమ్మని పిలుస్తూ..లుంగీతోనే బయలుదేరేస్తూ..చెప్పులేసుకుంటూ..అమ్మ "అదేమిటండీ!తినే కంచం ముందు నుండి లేచారు.ఆ రెండు ముద్దలు తిని వెళ్తేనేం" అంటున్నా వినిపించుకోకుండా.
నేను చొక్కా అందించి.. వేసుకుంటూ గేటు దాటుతున్న నాన్న వెనకాలే వెళ్ళాను అక్క పెళ్ళి సంబరంతో.
నాన్న వేగంగా వెళ్ళి మేనేజర్తో తేదీ చెప్పి నా చేత్తో అడ్వాన్స్ ఇప్పిస్తుండగా హడావిడిగా మరో వ్యక్తి ప్రవేశించారు.మేము అడిగిన తేదీనే ఆయన అడిగి బుక్ అయిపోయిందని విని హతాశుడై నిలుచుండిపోయారు కాసేపు.
నోరు తెరిచి చూస్తున్న నేను నాన్న భుజం పై చెయ్యి వేసి "వెళ్దామా అమ్మా!" అనేసరికి తేరుకున్నాను.
**" సమయం ఎంత విలువైందో నేను ప్రత్యక్షంగా తెలుసుకున్న సందర్భం అది."**
ఇంటికొచ్చాక విషయం తెలుసుకుని అమ్మ కూడా ఆనందించడం,ఆ కళ్యాణ మండపం లో జరిగిన మూడో పెళ్ళిగా మా అక్క పెళ్ళి మామూలే అనుకోండి.
కానీ ఈ సంఘటన నాన్న నుండి నేను నేర్చుకున్న అతి విలువైన పాఠాలలో ఒకటిగా మిగిలిపోయింది.తీవ్రమైన సమయాభావంతో ప్రతి రోజూ ఉద్యోగరీత్యా రానుపోను 65కి.మీ.నా ప్రయాణ సమయాన్ని వృధా కానివ్వకుండా బస్ లో కథలు రాసే ఆలోచననిచ్చింది.ఆ మైనస్ ని ఏదోలా ప్లస్ చేస్తున్నాననే తృప్తినిచ్చింది.ఆరోగ్యవంతమైన దృక్పధాన్నలవరుచుకునేలా చేసిన నాన్నకు ప్రేమతో....
-గుడిపూడి రాధికారాణి.

Good memory... Everybody must be having some or other memories like this... thanks for sharing.
రిప్లయితొలగించండి