30, మార్చి 2017, గురువారం

ugadi..29.3.2017

ప్రభుత్వ జిల్లా సాంస్కృతిక సమాఖ్య నిర్వహించిన 29.3.2017 హేవిళంబి ఉగాది కవిసమ్మేళనం లో నేనూ పాల్గొన్నాను.మహిళల్లో ధైర్యం పెరగాలని ఆకాంక్షిస్తూ కవిత చదివి సన్మానింపబడ్డాను.బందరు టౌన్ హాల్లో ఈ కార్యక్రమం జరగడం నాకెంతో సంతోషం కలిగించింది.ఆ వేదికపై నేను ఆంధ్ర సారస్వత సమితి,సాహితీమిత్రులు వంటి మంచి సంస్థలచే పురస్కారాలు పొందాను.ఎన్నో ఉపన్యాసాలు ఇచ్చాను.నేడు అది చీరల దుకాణం గా మారిన తరుణంలో ఈ వేదిక మళ్ళీ ఎక్కగలగడం నా మధురస్మృతులను వెలికితీసి సన్నజాజి పరిమళం సోకినట్లు  మనసుకు హాయినిచ్చింది. ఆ వార్తకు చెందిన పేపర్ క్లిప్స్ వరుసగా ఆంధ్రజ్యొతి, ఈనాడు, ఆంధ్రభూమి,సాక్షి లు మీకోసం..(ఇతర కవులు శ్రీ గుడిసేవ విష్ణుప్రసాద్,కారుమూరి రాజేంద్రప్రసాద్,ముదిగొండ శాస్త్రి,సత్యనారాయణ రావు, డా.చింతలపాటి మురళీకృష్ణ,దండిభొట్ల దత్తాత్రేయ శర్మ, ముదిగొండ సీతారావమ్మ, మడమల రాంబాబు,జాన్ బాబు, రాజశేఖర్, మేరీ కృపాబాయి,సుధారాణి,మాధవి,రామకృష్ణ మరియు సమన్వయ కర్త భావతరంగిణి సంపాదకులు భవిష్య). 

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి