మిత్రులారా! శుభ సాయంత్రం. ఈ రోజు నాకు చాలా సంతోషంగా ఉంది. జిల్లా విద్యాశాఖాధికారి శ్రీ సుబ్బారెడ్డి గారు నా బాలసాహితీ కృషిని ప్రశంసిస్తూ నాకు ప్రత్యేక సన్మానం చేశారు.నా కథలలో 'అమ్ములూ-అయిదు రూపాయలూ" కథ బాగా నచ్చిందని పేర్కొంటూ నా సాహితీ ప్రక్రియలను ప్రోత్సహించే టానిక్ గా ఈ సత్కారాన్ని భావింపవలసిందిగా తెలిపారు.టెంత్ స్పాట్ వేల్యుయేషన్ మూడవ రోజు,శ్రీ రామనవమి ...మచిలీపట్నం సెయింట్ ఫ్రాన్సిస్ స్కూల్ ఆవరణలో జిల్లావ్యాప్తంగా వచ్చిన ఉపాధ్యాయుల మధ్య లభించిన ఈ గౌరవం నాకు చాలా ప్రత్యేకమయినది.నా సాహితీ ప్రయాణాన్ని గురించి నాతో మాట్లాడించారు,వారూ మాట్లాడారు. నేను రాసిన గజల్ ఒకటి పాడించారు.గణిత ఉపాధ్యాయిని అయినా చక్కని శైలితో మంచి కథలు రాస్తున్నానని కొనసాగించమని దీవించారు.వృత్తి ప్రవృత్తులలో రాణిస్తున్న మరి కొందరికి కూడా సన్మానాలు జరిగాయి.
చాలా సంతోషం రాధిక గారు. అభినందనలు
రిప్లయితొలగించండిthnq madam
రిప్లయితొలగించండి