21, మార్చి 2020, శనివారం
16, మార్చి 2020, సోమవారం
నా మూడు పుస్తకాలు.
నా మూడు పుస్తకాలు..
ముందుమాట రాసి ఆశీర్వదించిన మాన్యులకు వందనాలు.
1. చెట్లు ఆరోగ్యానికి మెట్లు...
డా.బృందావనం ధన్వంతరి ఆచార్యులు గారు మరియు డా.జి.వి.పూర్ణచంద్ గారు,శ్రీ వడిచర్ల సత్యం గారు (ప్రక్రియ సృష్టి కర్త)
2.వాగ్దేవీ! వందనం!!
డా.గుడిసేవ విష్ణు ప్రసాద్ గారు , డా.అడిగొప్పుల సదయ్య గారు (ప్రక్రియ సృష్టి కర్త)
3. జీవిత సత్యాలు
డా.గుత్తికొండ సుబ్బారావు గారు , శ్రీ రమేష్ గోస్కుల గారు (ప్రక్రియ సృష్టి కర్త).

.

జనవరి,2020 తెలుగువిద్యార్థి మాసపత్రికలో డా.మాదిరాజు రామలింగేశ్వర రావుగారికి అక్షరాంజలిగా నేను సమర్పించిన వ్యాసం ప్రచురితం.
జనవరి,2020 తెలుగువిద్యార్థి మాసపత్రికలో డా.మాదిరాజు రామలింగేశ్వర రావుగారికి అక్షరాంజలిగా నేను సమర్పించిన వ్యాసం ప్రచురితం.

లేబుళ్లు:
వ్యాసం
మార్చ్,2020 భావతరంగిణి మాసపత్రికలో నా 3 సమీక్షలు..
మార్చ్,2020 భావతరంగిణి మాసపత్రికలో నా 3 సమీక్షలు..
1.దగ్ధపల్లవుల పాట(దీర్ఘ కవిత)--శ్రీ ఏటూరి నాగేంద్ర రావు
2.మనిషి కనబడుటలేదు(కవిత్వం)--శ్రీ గుడిమెట్ల చెన్నయ్య
3.అన్నపూర్ణమ్మకు అక్షరాంజలి(80 మంది కవుల పంచ ప్రక్రియల సంకలనం)--శ్రీ శిష్ఠు సత్య రాజేష్.

పుస్తక సమీక్ష.
(14.3.2019) ఈనాడు కృష్ణా సెంటర్ స్ప్రెడ్ లో నా కవిత.."ఓటును నమ్ముకో..అమ్ముకోకు"
(14.3.2019) ఈనాడు కృష్ణా సెంటర్ స్ప్రెడ్ లో నా కవిత.."ఓటును నమ్ముకో..అమ్ముకోకు"

ఈనాడు హాయ్ బుజ్జీలో నా 84 వ కథ.."గాయం నేర్పిన పాఠం".(29.2.2020)
లేబుళ్లు:
84,
ఈనాడు,
ఈనాడు హాయ్ బుజ్జీ,
కథ,
పిల్లల కథ,
బాల సాహిత్యం
4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల ప్రత్యేక సంచిక "తెలుగు ప్రపంచం " లో ప్రచురితమైన నా గజల్.
4వ ప్రపంచ తెలుగు రచయితల మహాసభల ప్రత్యేక సంచిక "తెలుగు ప్రపంచం " లో ప్రచురితమైన నా గజల్.

(15.1.2020) ఈనాడు కృష్ణా సెంటర్ స్ప్రెడ్ లో నా సంక్రాంతి కవిత
(15.1.2020) ఈనాడు కృష్ణా సెంటర్ స్ప్రెడ్ లో నా సంక్రాంతి కవిత

స్వాగత పత్ర సమర్పణ
పూర్వజన్మ సుకృతం ఈ ప్రాప్తం..కార్తీక దీపోత్సవ వేళ మైసూరు దత్తపీఠం ఉత్తరాధిపతి శ్రీశ్రీ దత్తవిజయానంద తీర్థ స్వామీజీకి పద్య రూపంలో స్వాగత పత్ర సమర్పణ మహద్భాగ్యం..

లేబుళ్లు:
నా సాహితీ పురోగతి.,
padyam
(డిసెంబర్,2019) భావతరంగిణి మాసపత్రికలో ప్రచురితమైన నా సమీక్షలు..
లేబుళ్లు:
పుస్తక సమీక్ష.
గోరసం ప్రథమ వార్షికోత్సవ సభలో డొక్కాసీతమ్మ తల్లి పంచ ప్రక్రియల సంకలన ఆవిష్కరణ అనంతరం సమీక్షా సత్కారం
గోరసం ప్రథమ వార్షికోత్సవ సభలో డొక్కాసీతమ్మ తల్లి పంచ ప్రక్రియల సంకలన ఆవిష్కరణ అనంతరం సమీక్షా సత్కారం

లేబుళ్లు:
కవిత,
పురస్కారాలు,
సంకలనాలు
ఇష్టపదులు

లేబుళ్లు:
కవిత
వనపర్తిలో ఆవిష్కరింపబడిన **బతుకమ్మ మొగ్గలు** 1౦౦ మంది కవుల కవితాసంకలనంలో నా మొగ్గలు..ప్రక్రియ సృష్టికర్త. డా.భీంపల్లి శ్రీకాంత్
వనపర్తిలో ఆవిష్కరింపబడిన **బతుకమ్మ మొగ్గలు** 1౦౦ మంది కవుల కవితాసంకలనంలో నా మొగ్గలు..ప్రక్రియ సృష్టికర్త. డా.భీంపల్లి శ్రీకాంత్

నవంబర్,2019 భావతరంగిణి మాసపత్రికలో ప్రచురితమైన నా మణిపూసలు.
నవంబర్,2019 భావతరంగిణి మాసపత్రికలో ప్రచురితమైన నా మణిపూసలు.

లేబుళ్లు:
కవిత
(14.11.2019) ఈనాడు కృష్ణా సెంటర్ స్ప్రెడ్ లో బాలల దినోత్సవమ్ సందర్భంగా నా " బాల్యమెంత హాయికదా" మణిపూసలు ప్రచురితం .
(14.11.2019) ఈనాడు కృష్ణా సెంటర్ స్ప్రెడ్ లో బాలల దినోత్సవమ్ సందర్భంగా నా " బాల్యమెంత హాయికదా" మణిపూసలు ప్రచురితం .
**బాల్యమెంత హాయికదా!**
**మణిపూసలు**
✍గుడిపూడి రాధికారాణి.
**మణిపూసలు**
✍గుడిపూడి రాధికారాణి.
కోయిలలా పాడినపుడు
నెమలిలాగ ఆడినపుడు
బాల్యమెంత హాయికదా!
కల్మషమే ఉండదపుడు (1)
నెమలిలాగ ఆడినపుడు
బాల్యమెంత హాయికదా!
కల్మషమే ఉండదపుడు (1)
నింగియంత మాదేనోయ్
గాలిపటాలెగరెయవోయ్
బాల్యమెంత హాయికదా!
గగనమంత సంబరమోయ్ (2)
గాలిపటాలెగరెయవోయ్
బాల్యమెంత హాయికదా!
గగనమంత సంబరమోయ్ (2)
వానలోన తడిశాము
ఎండలోన ఆడాము
బాల్యమెంత హాయికదా!
నిశ్చింతగ పెరిగాము (3)
ఎండలోన ఆడాము
బాల్యమెంత హాయికదా!
నిశ్చింతగ పెరిగాము (3)
పెద్దలనెదిరించలేదు
పిన్నల బెదిరించలేదు
బాల్యమెంత హాయికదా!
మూర్ఖత్వపు జాడలేదు (4)
పిన్నల బెదిరించలేదు
బాల్యమెంత హాయికదా!
మూర్ఖత్వపు జాడలేదు (4)
చేతలో నిజాయితీ
కరుణ ఆనవాయితీ
బాల్యమెంత హాయికదా!
మనసుకాదే కోతీ (5)
కరుణ ఆనవాయితీ
బాల్యమెంత హాయికదా!
మనసుకాదే కోతీ (5)
గురువుచేత బెత్తము
లీడరుప్రతాపము
బాల్యమెంత హాయికదా!
దెబ్బకూడ మధురము (6)
లీడరుప్రతాపము
బాల్యమెంత హాయికదా!
దెబ్బకూడ మధురము (6)
పంచుకున్న తాయిలాలు
ఎంచుకున్న ఆశయాలు
బాల్యమెంత హాయికదా!
తలుచుకున్న జ్ఞాపకాలు (7)
ఎంచుకున్న ఆశయాలు
బాల్యమెంత హాయికదా!
తలుచుకున్న జ్ఞాపకాలు (7)
విన్న దెయ్యాల కథలు
నాడు ఆడిన ఆటలు
బాల్యమెంత హాయికదా!
తలిస్తే పులకింతలు (8)
నాడు ఆడిన ఆటలు
బాల్యమెంత హాయికదా!
తలిస్తే పులకింతలు (8)
నేనే టీచరునైతే
పాఠశాల సెలవైతే
సెలవెంతో హాయికదా!
అపుడూ ఇపుడూ అంతే (9)
పాఠశాల సెలవైతే
సెలవెంతో హాయికదా!
అపుడూ ఇపుడూ అంతే (9)
చిన్ననాటి అల్లరేది?
చిలిపితనపు సందడేది?
బాల్యమెంత హాయికదా!
తలపులలో మిగిలినదది (10)
చిలిపితనపు సందడేది?
బాల్యమెంత హాయికదా!
తలపులలో మిగిలినదది (10)
బాల్యదశను దాటినా
వృద్దాప్యము చేరినా
బాల్యమెంత హాయికదా!
మనసు పసిగ మిగిలెనా (11)
వృద్దాప్యము చేరినా
బాల్యమెంత హాయికదా!
మనసు పసిగ మిగిలెనా (11)
లేబుళ్లు:
ఈనాడు,
కవిత,
బాల సాహిత్యం
(14.11.2019)ఈనాడు హాయ్ బుజ్జీ లో మా బడిపిల్లలు రాసిన కవితలు.
(14.11.2019)ఈనాడు హాయ్ బుజ్జీ లో మా బడిపిల్లలు రాసిన కవితలు..వారికి బాలలదినోత్సవ తాయిలంగా..ధన్యవాదాలు హాయ్ బుజ్జీ డెస్క్ కి.

లేబుళ్లు:
ఈనాడు,
ఈనాడు హాయ్ బుజ్జీ,
కవిత,
బాల సాహిత్యం
*రుద్రారం శ్రీనివాసులు రెడ్డిగారి స్మృతి గజల్**
**రుద్రారం శ్రీనివాసులు రెడ్డిగారి స్మృతి ముషాయిరా గజల్**
గజలు మహలున భావములు కలబోసుకొంటిని సోదరా!
అక్షర వనపు స్నేహసుమములు ఏరుకొంటిని సోదరా!
అక్షర వనపు స్నేహసుమములు ఏరుకొంటిని సోదరా!
మొన్న నిన్నై నిన్న నేడై నిలిచిపోయెను ఎందుకో
కాలచక్రపు జ్ఞాపకాలను తవ్వుకొంటిని సోదరా!
కాలచక్రపు జ్ఞాపకాలను తవ్వుకొంటిని సోదరా!
గగనమందున తార నీవై వెలిగిపోవుట కంటినోయ్
చీకటింటిన కాంతిగంధము పూసుకొంటిని సోదరా!
చీకటింటిన కాంతిగంధము పూసుకొంటిని సోదరా!
చినుకు రాలిన సందడినిగని నిన్నుతలచితి మిత్రమా!
వానవలె నీ షేర్లు కురవగ మురుసుకొంటిని సోదరా!!
వానవలె నీ షేర్లు కురవగ మురుసుకొంటిని సోదరా!!
ఓర్మితో నా గజలు చదువుచు మెచ్చుకొంటిరి గతములో
పేర్మితో మీ గజలునొక్కటి పాడుకొంటిని సోదరా!
పేర్మితో మీ గజలునొక్కటి పాడుకొంటిని సోదరా!
కాలమెంతటి కఠినమైనది గండ్రశిలయే నయముగా
మరచుటెంతటి కష్టమోయని ఒప్పుకొంటిని సోదరా!
మరచుటెంతటి కష్టమోయని ఒప్పుకొంటిని సోదరా!
నేడు మిమ్ముల తలచుకొంటిమి రేపు నా గతి ఏమిటో!
రాధికగ నను తలచుకొమ్మని కోరుకొంటిని సోదరా!!
********************************************
గుడిపూడి రాధికారాణి(5.9.2019)
రాధికగ నను తలచుకొమ్మని కోరుకొంటిని సోదరా!!
********************************************
గుడిపూడి రాధికారాణి(5.9.2019)
లేబుళ్లు:
సంకలనాలు
కాళోజీ రాష్ట్రస్థాయి సాహితీ పురస్కారం
(9.9.2019) తెలంగాణ రాష్ట్రం జగిత్యాల జిల్లాలో కాళోజీ 105 వ జయంతి మరియు తెలంగాణ భాషా దినోత్సవం సందర్భంగా కళాశ్రీ సాహితీ వేదిక ఆధ్వర్యంలో జాయింట్ కలెక్టర్ శ్రీ రాజేశం ,సంస్థ అధిపతి శ్రీ గుండేటి రాజు, కార్యక్రమ కమిటీ చైర్మన్ శ్రీ శైలజా రెడ్డి ల చేతుల మీదుగా " కాళోజీ రాష్ట్రస్థాయి సాహితీ పురస్కారం " అందుకున్నాను ..

లేబుళ్లు:
పురస్కారాలు
(సెప్టెంబర్,2019) భావతరంగిణి మాసపత్రికలో నా సమీక్షలు.
(సెప్టెంబర్,2019) భావతరంగిణి మాసపత్రికలో నా సమీక్షలు.
శ్రీ దగ్గుమాటి పద్మాకర్ గారి అద్భుత కథా సంపుటి "ఈస్తటిక్ స్పేస్"
గోరసం అధ్యక్షులు శిష్టు సత్యరాజేష్ సంపాదకత్వంలో మహిళాభ్యుదయ సంకలనం(వచన కవిత్వం)

శ్రీ దగ్గుమాటి పద్మాకర్ గారి అద్భుత కథా సంపుటి "ఈస్తటిక్ స్పేస్"
గోరసం అధ్యక్షులు శిష్టు సత్యరాజేష్ సంపాదకత్వంలో మహిళాభ్యుదయ సంకలనం(వచన కవిత్వం)

లేబుళ్లు:
పుస్తక సమీక్ష.
డా.బృందావనం ధన్వంతరాచార్యులుగారికి శ్రీ మద్వైఖానస మహామండలి,మచిలీపట్నం శాఖ వారి విశిష్ట పురస్కార సందర్భమున నేను రచించిన 9 ఆటవెలదుల పద్యకుసుమాంజలి ..
డా.బృందావనం ధన్వంతరాచార్యులుగారికి
శ్రీ మద్వైఖానస మహామండలి,మచిలీపట్నం శాఖ వారి విశిష్ట పురస్కార సందర్భమున నేను రచించిన 9 ఆటవెలదుల పద్యకుసుమాంజలి ..
శ్రీ మద్వైఖానస మహామండలి,మచిలీపట్నం శాఖ వారి విశిష్ట పురస్కార సందర్భమున నేను రచించిన 9 ఆటవెలదుల పద్యకుసుమాంజలి ..
ఆ.వె.
ధరణియందునపర ధన్వంతరియె వీరు
నేత్ర వైద్యరంగ నిపుణులైరి
సున్నితమగు వాక్కు సునిశితమగు చూపు
కన్నులందు కలదు కాంతిరేఖ (1)
నేత్ర వైద్యరంగ నిపుణులైరి
సున్నితమగు వాక్కు సునిశితమగు చూపు
కన్నులందు కలదు కాంతిరేఖ (1)
నడతనేర్ప తండ్రి నారాయణాచార్య
నిలుపుకొనిరి యశము నిరవతముగ
అనఘ దత్తపీఠ ఆస్థాన విద్వాను
దత్తకృపను పొంది దండిగాను (2)
నిలుపుకొనిరి యశము నిరవతముగ
అనఘ దత్తపీఠ ఆస్థాన విద్వాను
దత్తకృపను పొంది దండిగాను (2)
హితముకోరి నడిపె హిందూకళాశాల
పెక్కుసంస్థలున్ను పేర్మితోడ
విఖనసమ్మునందు వీరి సేవలుజూడ
బందరందు జనుల బంధువైరి (3)
పెక్కుసంస్థలున్ను పేర్మితోడ
విఖనసమ్మునందు వీరి సేవలుజూడ
బందరందు జనుల బంధువైరి (3)
ఆంజనేయ స్వామి ఆలయమ్మును కట్టి
మహతి వేదికగను మలచినారు
హాస్యలహరి సంస్థ హసనాల రాజుగా
నవ్వు రోగములనునణచుననిరి (4)
మహతి వేదికగను మలచినారు
హాస్యలహరి సంస్థ హసనాల రాజుగా
నవ్వు రోగములనునణచుననిరి (4)
సాహితీ సభలన సంభాషణల మేటి
ధారణమ్ములోన ధాటిజూపి
అక్షరాల సృజన అలవోకగాజేసి
పరులు మెచ్చునట్టి పథమునందె (5)
ధారణమ్ములోన ధాటిజూపి
అక్షరాల సృజన అలవోకగాజేసి
పరులు మెచ్చునట్టి పథమునందె (5)
గువ్వలా ఒదిగెను గూడూరు గుండెలో
స్వంతవూరివారు సంతసించ
సద్దుచేయకుండ చాటింపు లేకుండ
వితరణలనుజేయు వినయశీలి (6)
స్వంతవూరివారు సంతసించ
సద్దుచేయకుండ చాటింపు లేకుండ
వితరణలనుజేయు వినయశీలి (6)
వైద్యవృత్తిలోన వైశిష్ఠ్యమును జూపి
సజ్జనుడిగ మసలు సౌమ్యశీలి
కేతనమెగరేయ కేశవకృష్ణుండు
పుత్రవృద్దిగాంచి పొంగినారు (7)
సజ్జనుడిగ మసలు సౌమ్యశీలి
కేతనమెగరేయ కేశవకృష్ణుండు
పుత్రవృద్దిగాంచి పొంగినారు (7)
వంశ వ్యాప్తి కొరకు వసుధను గాలించి
కోరి తెచ్చుకొనిరి కోడలిగను
సహనదేవతంద్రు శైలజమ్మను కూడ
సుదతియామె వాక్కు సుధలు చిలుకు (8)
కోరి తెచ్చుకొనిరి కోడలిగను
సహనదేవతంద్రు శైలజమ్మను కూడ
సుదతియామె వాక్కు సుధలు చిలుకు (8)
శతము దాటిపోయి సంతోషకరముగ
గడపవలయు మీరు ఘనముగాను
రమయె తోడుయైన రమణీయజంటగా
వినయవందనాలు వేలవేలు (9)
***************************
కలం మరియు గళం :గుడిపూడి రాధికారాణి.
15.8.2019.
శ్రీమద్వైఖానస మహామండలి మచిలీపట్నం శాఖ.
గడపవలయు మీరు ఘనముగాను
రమయె తోడుయైన రమణీయజంటగా
వినయవందనాలు వేలవేలు (9)
***************************
కలం మరియు గళం :గుడిపూడి రాధికారాణి.
15.8.2019.
శ్రీమద్వైఖానస మహామండలి మచిలీపట్నం శాఖ.

లేబుళ్లు:
padyam
7.7.2019) హైదరాబాద్ రవీంద్రభారతి లో ఆవిష్కరింపబడిన "వరకవి సిద్ధప్ప స్మారక కవితా సంకలనం" లో ప్రచురితమైన నా పద్యాలు ..
7.7.2019) హైదరాబాద్ రవీంద్రభారతి లో ఆవిష్కరింపబడిన "వరకవి సిద్ధప్ప స్మారక కవితా సంకలనం" లో ప్రచురితమైన నా పద్యాలు ..
**కనుమరుగవుతున్న కులవృత్తులు** ( ఆటవెలదులు)
**కనుమరుగవుతున్న కులవృత్తులు** ( ఆటవెలదులు)
ఆ.వె. 1.
పల్లె పదము పాట పాడు ముచ్చటగను
గొర్రె మేక కాయు గొల్ల కురుమ
కర్ర పట్టి నడిపి కాపలా కాసేరు
నేడు కానరారు నెపమెవరిది?
పల్లె పదము పాట పాడు ముచ్చటగను
గొర్రె మేక కాయు గొల్ల కురుమ
కర్ర పట్టి నడిపి కాపలా కాసేరు
నేడు కానరారు నెపమెవరిది?
ఆ.వె.2
బట్టలుతక మరలు-బాదే పనేదిక?
బండనేసి బాది బాది తెచ్చు
రజకులకిక కరువురా బతుకుతెరువు
గాడి దప్ప జనులు గాడిదేడ్చె
బండనేసి బాది బాది తెచ్చు
రజకులకిక కరువురా బతుకుతెరువు
గాడి దప్ప జనులు గాడిదేడ్చె
ఆ.వె.3
గంగిరెద్దు ఆట గారడీ విద్యలు
తోలుబొమ్మలాట తొలగిపోయె
లలితములగు బుట్టలల్లు వారేరిర?
కూలిపనికి మారి కుమిలిపోయె
తోలుబొమ్మలాట తొలగిపోయె
లలితములగు బుట్టలల్లు వారేరిర?
కూలిపనికి మారి కుమిలిపోయె
ఆ.వె.4
మట్టిపాత్రలేవి? మరుగున పడినవి
జనులు ప్లాస్టికనుచు జపము చేయ
కొత్తకుండ నీరు కోరినా దొరకవు
కుములు కాలమొచ్చె కుమ్మరులకు
జనులు ప్లాస్టికనుచు జపము చేయ
కొత్తకుండ నీరు కోరినా దొరకవు
కుములు కాలమొచ్చె కుమ్మరులకు
-------------------------
గుడిపూడి రాధికారాణి
గుడిపూడి రాధికారాణి

కైతికాలు ప్రక్రియ ప్రథమ సంకలనంలో నా కైతికాలు "నిదురెంతో హాయి కదా!" ప్రచురితం.

తొలివలపే తీయనౌను
మధురోహలు ముంచుకొచ్చు
భవితకొరకు కలలు
కనగ
బాధ్యతలే తరుముకొచ్చు
నిదురెంతో హాయికదా!
కలల అలల తేలియాడ
అలసటనే అణచివేయ
అసలుసిసలు ఔషధమిది
సత్తువ సమకూరుటకే
సమయమిచ్చు నేస్తమిది
నిదురెంతో హాయికదా!
సేదదీరు దారికదా
!
నిదురలోన కన్నకలలు
మెలకువతో మరపుకొచ్చు
భయమేదో తరిమిననూ
మరల నిదుర ముంచుకొచ్చు
నిదురెంతో హాయికదా!
కలల అలల తేనె ఊట
శ్రీ వెంకటేశ్వర వెభవం లో నా కవిత "శ్రీవారికొక లేఖా కుసుమం "
రవీంద్రభారతిలో తెలుగు భాషా చైతన్య సమితి వారి ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర వెభవం పుస్తకావిష్కరణ కార్యక్రమం మఱియు కవిసమ్మేళనము జరిగింది. అందులో నా కవిత "శ్రీవారికొక లేఖా కుసుమం " ప్రచురితమయింది.
శ్రీవారి పాదపద్మముల చెంతకొక లేఖా కుసుమం..
***********************************
***********************************
ధరలను ధరణిని దాటనీకుమా ధరణీనాయకా!
అతివకు ఆదరణ అందనీయుమా వజ్రకవచధారీ!
అతివకు ఆదరణ అందనీయుమా వజ్రకవచధారీ!
బాలల అపహరణ అడ్డుకోవయా ఆపన్నివారణా!
అవయవాల తస్కరణ ఆపవయా అనాధరక్షకా!
నరులను తరువుల నరకనీకుమా తులసీవనమాలీ!
నీటిబొట్టుకై కన్నీటిబొట్టు విడువనీకు నీలమేఘశ్యామా!
కాలుష్యకోరలను పెకలించి మము కావుమా కరుణాసాగరా!
మానవులలో దానవతను దునుమాడుమా దశముఖ మర్దనా!
కావరము కలవారి కన్నులను తెరిపించు కమల దళాక్షా!
తాతబామ్మలతోటి తిరిగేటి వరమొసగు తిరుమలవాసా!
బతుకులో యాంత్రికతను ఇకనైన తొలగించు బ్రహ్మాండ రూపా!
వసుధలో వసంతమే వాడిపోనీకయా వసుదేవతనయా!
మనిషిలో మమతలే మాసిపోనీకయా మత్స్యావతారా!
అక్షరమె సుమముగా అర్చించినానయా ఆద్యంతరహితా!
అందరికి అండవై ఆదుకొనరావయా అభయహస్త ప్రదర్శకా!
దీనులకు దీపమై బాధితుల బాసటగు పరమదయాళో!
శేషమగు జీవితమె శాంతముగ సాగనీ శేషాద్రినిలయా!
*******************
గుడిపూడి రాధికారాణి,
మచిలీపట్నం,కృష్ణాజిల్లా.

అమ్మ నాన్న ఓ కవిత సంకలనం లో ప్రచురితం .
మార్గదర్శి మా నాన్న**
-గుడిపూడి రాధికారాణి.మచిలీపట్నం.
*******************************************
మళ్ళీ ఆడపిల్లేనా?
మూకంతా మూతి విరిచినా
మూర్ఖించకుండా మురిసిపోయింది
మానాన్నొక్కడే
-గుడిపూడి రాధికారాణి.మచిలీపట్నం.
*******************************************
మళ్ళీ ఆడపిల్లేనా?
మూకంతా మూతి విరిచినా
మూర్ఖించకుండా మురిసిపోయింది
మానాన్నొక్కడే
పొత్తిళ్ళలో పసిగుడ్డుగా
పొదివిపట్టుకోవడం చేతకాక
తన వేలును నా గుప్పిట్లో దూర్చి
తనివితీరా నన్నుచూసి
కళ్ళలో కాంతులు నింపుకుని
తన చేతిస్పర్శ నా మనసుకు తెలిసేలా
నా భవితకు భరోసానీ,భద్రతనీ
ఆర్ద్రంగా వర్షించిన కారుణ్య మేఘం...మా నాన్న.
పొదివిపట్టుకోవడం చేతకాక
తన వేలును నా గుప్పిట్లో దూర్చి
తనివితీరా నన్నుచూసి
కళ్ళలో కాంతులు నింపుకుని
తన చేతిస్పర్శ నా మనసుకు తెలిసేలా
నా భవితకు భరోసానీ,భద్రతనీ
ఆర్ద్రంగా వర్షించిన కారుణ్య మేఘం...మా నాన్న.
నాలుగో ఏటనే నాకు చదవటం నేర్పేసి
తన పెళ్ళినాటి నుండి కొనిదాచిన
చందమామల్ని నేను చదివేస్తుంటే
ముద్ద ముట్టక్కర్లేదిక అని
మురిసిపోయిన మెరుపుతునక...మా నాన్న.
తన పెళ్ళినాటి నుండి కొనిదాచిన
చందమామల్ని నేను చదివేస్తుంటే
ముద్ద ముట్టక్కర్లేదిక అని
మురిసిపోయిన మెరుపుతునక...మా నాన్న.
ఎడమచేత్తో రాసే నన్ను
పురచేతివాటం అని అంతా హేళన చేస్తుంటే
గెలిచిన రోజు ఈ సమాజమే
నీ సంతకం కోసం చేయి చాపుతుందని
ఊరడించిన మార్గదర్శి...మా నాన్న.
పురచేతివాటం అని అంతా హేళన చేస్తుంటే
గెలిచిన రోజు ఈ సమాజమే
నీ సంతకం కోసం చేయి చాపుతుందని
ఊరడించిన మార్గదర్శి...మా నాన్న.
ఆనాడు నా ముద్దుమాటలకు,ముత్యాలరాతకు
నాన్న మురిసిపోవడం నాకు గుర్తులేదు.
ఈనాడు నా ప్రసంగాలు,సాహితీ ఉన్నతులు
చూపి మురిసిపోదామంటే నాన్న లేరు.
నాన్న మురిసిపోవడం నాకు గుర్తులేదు.
ఈనాడు నా ప్రసంగాలు,సాహితీ ఉన్నతులు
చూపి మురిసిపోదామంటే నాన్న లేరు.
అయితేనేం...నా రచనలకు
మీ చప్పట్లతో నాన్న నా వీపు తట్టినట్లు
మీ మెచ్చుకోళ్ళలో నాన్న కళ్ళు మెరిసినట్లు
ఇప్పటికీ నాన్న వేలుని నా గుప్పిట్లో పదిలంగా పట్టుకున్నట్లు
ఆ ఊహయే నా కలమును కదిలించేస్తున్నట్లు...
అంతే మరి...
భావనలే కదా బతుకు బండి ఇంధనాలు...
******************************************
అమ్మ నాన్న ఓ కవిత సంకలనం లో ప్రచురితం .
I LoVE YOU నాన్న ..I MISS YOU..

12, మార్చి 2020, గురువారం
నా సమీక్షలు..ఏప్రిల్,2019 భావతరంగిణి మాసపత్రికలో .. 1.కైత: శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి. 2.ప్రళయం: శ్రీ చలపాక ప్రకాష్.
నా సమీక్షలు..ఏప్రిల్,2019 భావతరంగిణి మాసపత్రికలో ..
1.కైత: శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి.
2.ప్రళయం: శ్రీ చలపాక ప్రకాష్.

1.కైత: శ్రీమతి రాజా వాసిరెడ్డి మల్లీశ్వరి.
2.ప్రళయం: శ్రీ చలపాక ప్రకాష్.

లేబుళ్లు:
పుస్తక సమీక్ష.
(మే,2019) భావతరంగిణి మాసపత్రికలో నా సమీక్షలు: 1.చౌరస్తాలో సముద్రం(కవిత్వం)-శ్రీ సంగెవేని రవీంద్ర. 2.మధుమాలిక(కథలు)-ఉప్పలూరి మధుపత్ర శైలజ. 3.పూనాలో పూచిన నానీలు- శ్రీమతి సీతాసుధాకర్.
(మే,2019) భావతరంగిణి మాసపత్రికలో నా సమీక్షలు:
1.చౌరస్తాలో సముద్రం(కవిత్వం)-శ్రీ సంగెవేని రవీంద్ర.
2.మధుమాలిక(కథలు)-ఉప్పలూరి మధుపత్ర శైలజ.
3.పూనాలో పూచిన నానీలు- శ్రీమతి సీతాసుధాకర్.

1.చౌరస్తాలో సముద్రం(కవిత్వం)-శ్రీ సంగెవేని రవీంద్ర.
2.మధుమాలిక(కథలు)-ఉప్పలూరి మధుపత్ర శైలజ.
3.పూనాలో పూచిన నానీలు- శ్రీమతి సీతాసుధాకర్.

లేబుళ్లు:
పుస్తక సమీక్ష.
(14.4.2019) గోదావరి దినపత్రికలో నా కవిత .." అసలేమనుకున్నావు? "
(14.4.2019) గోదావరి దినపత్రికలో నా కవిత .." అసలేమనుకున్నావు? "

లేబుళ్లు:
కవిత
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)