*ప్రేమస్వరూపిణి**
************
************
ఎడారి ఎండలో ఎండమావి అని ఎండి అతడుంటే
వానచినుకై ఒయాసిస్సు ఒడ్డున చెట్టై ఆమె..
వానచినుకై ఒయాసిస్సు ఒడ్డున చెట్టై ఆమె..
విశాలవిశ్వంలో ఒంటరై విస్తుపోతూ అతడుంటే
నీడై తోడై హస్తమొదలని నేస్తమై ఆమె..
నీడై తోడై హస్తమొదలని నేస్తమై ఆమె..
జనారణ్యంలో జవసత్వాలుడిగి అతడుంటే
నగయై నగవై నవచైతన్యపు నవ్యనాదమై ఆమె..
నగయై నగవై నవచైతన్యపు నవ్యనాదమై ఆమె..
బాధ్యతలకు బందీయై ఉక్కిరిబిక్కిరై అతడుంటే
ఊపిరై ఊతమై ఉత్సాహపు ఉనికియై ఆమె..
ఊపిరై ఊతమై ఉత్సాహపు ఉనికియై ఆమె..
వసంతమే కానరాని శిశిరంలో అతడుంటే
వానవిల్లై వర్ణమయమై ఎదన వల్లరియై ఆమె..
వానవిల్లై వర్ణమయమై ఎదన వల్లరియై ఆమె..
ఓటమిబాటన హతాశుడై చతికిలబడి అతడుంటే
ఒంట్లో ఓపికై విజయానికి బాటయై బాసటై ఆమె..
ఒంట్లో ఓపికై విజయానికి బాటయై బాసటై ఆమె..
అవును...ఆమె లేనిదే అతడు లేడు
అందుకే...
ఆడపిల్లని ఆదరించే, గౌరవించేవాడు
మంచివాడో గొప్పవాడో కాదు
అవనిలోన అదృష్టవంతుడు.
-------------------------------------------
గుడిపూడి రాధికారాణి,మచిలీపట్నం.
అందుకే...
ఆడపిల్లని ఆదరించే, గౌరవించేవాడు
మంచివాడో గొప్పవాడో కాదు
అవనిలోన అదృష్టవంతుడు.
-------------------------------------------
గుడిపూడి రాధికారాణి,మచిలీపట్నం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి