**రుద్రారం శ్రీనివాసులు రెడ్డిగారి స్మృతి ముషాయిరా గజల్**
గజలు మహలున భావములు కలబోసుకొంటిని సోదరా!
అక్షర వనపు స్నేహసుమములు ఏరుకొంటిని సోదరా!
అక్షర వనపు స్నేహసుమములు ఏరుకొంటిని సోదరా!
మొన్న నిన్నై నిన్న నేడై నిలిచిపోయెను ఎందుకో
కాలచక్రపు జ్ఞాపకాలను తవ్వుకొంటిని సోదరా!
కాలచక్రపు జ్ఞాపకాలను తవ్వుకొంటిని సోదరా!
గగనమందున తార నీవై వెలిగిపోవుట కంటినోయ్
చీకటింటిన కాంతిగంధము పూసుకొంటిని సోదరా!
చీకటింటిన కాంతిగంధము పూసుకొంటిని సోదరా!
చినుకు రాలిన సందడినిగని నిన్నుతలచితి మిత్రమా!
వానవలె నీ షేర్లు కురవగ మురుసుకొంటిని సోదరా!!
వానవలె నీ షేర్లు కురవగ మురుసుకొంటిని సోదరా!!
ఓర్మితో నా గజలు చదువుచు మెచ్చుకొంటిరి గతములో
పేర్మితో మీ గజలునొక్కటి పాడుకొంటిని సోదరా!
పేర్మితో మీ గజలునొక్కటి పాడుకొంటిని సోదరా!
కాలమెంతటి కఠినమైనది గండ్రశిలయే నయముగా
మరచుటెంతటి కష్టమోయని ఒప్పుకొంటిని సోదరా!
మరచుటెంతటి కష్టమోయని ఒప్పుకొంటిని సోదరా!
నేడు మిమ్ముల తలచుకొంటిమి రేపు నా గతి ఏమిటో!
రాధికగ నను తలచుకొమ్మని కోరుకొంటిని సోదరా!!
********************************************
గుడిపూడి రాధికారాణి(5.9.2019)
రాధికగ నను తలచుకొమ్మని కోరుకొంటిని సోదరా!!
********************************************
గుడిపూడి రాధికారాణి(5.9.2019)
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి