
తొలివలపే తీయనౌను
మధురోహలు ముంచుకొచ్చు
భవితకొరకు కలలు
కనగ
బాధ్యతలే తరుముకొచ్చు
నిదురెంతో హాయికదా!
కలల అలల తేలియాడ
అలసటనే అణచివేయ
అసలుసిసలు ఔషధమిది
సత్తువ సమకూరుటకే
సమయమిచ్చు నేస్తమిది
నిదురెంతో హాయికదా!
సేదదీరు దారికదా
!
నిదురలోన కన్నకలలు
మెలకువతో మరపుకొచ్చు
భయమేదో తరిమిననూ
మరల నిదుర ముంచుకొచ్చు
నిదురెంతో హాయికదా!
కలల అలల తేనె ఊట
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి