డా.బృందావనం ధన్వంతరాచార్యులుగారికి
శ్రీ మద్వైఖానస మహామండలి,మచిలీపట్నం శాఖ వారి విశిష్ట పురస్కార సందర్భమున నేను రచించిన 9 ఆటవెలదుల పద్యకుసుమాంజలి ..
శ్రీ మద్వైఖానస మహామండలి,మచిలీపట్నం శాఖ వారి విశిష్ట పురస్కార సందర్భమున నేను రచించిన 9 ఆటవెలదుల పద్యకుసుమాంజలి ..
ఆ.వె.
ధరణియందునపర ధన్వంతరియె వీరు
నేత్ర వైద్యరంగ నిపుణులైరి
సున్నితమగు వాక్కు సునిశితమగు చూపు
కన్నులందు కలదు కాంతిరేఖ (1)
నేత్ర వైద్యరంగ నిపుణులైరి
సున్నితమగు వాక్కు సునిశితమగు చూపు
కన్నులందు కలదు కాంతిరేఖ (1)
నడతనేర్ప తండ్రి నారాయణాచార్య
నిలుపుకొనిరి యశము నిరవతముగ
అనఘ దత్తపీఠ ఆస్థాన విద్వాను
దత్తకృపను పొంది దండిగాను (2)
నిలుపుకొనిరి యశము నిరవతముగ
అనఘ దత్తపీఠ ఆస్థాన విద్వాను
దత్తకృపను పొంది దండిగాను (2)
హితముకోరి నడిపె హిందూకళాశాల
పెక్కుసంస్థలున్ను పేర్మితోడ
విఖనసమ్మునందు వీరి సేవలుజూడ
బందరందు జనుల బంధువైరి (3)
పెక్కుసంస్థలున్ను పేర్మితోడ
విఖనసమ్మునందు వీరి సేవలుజూడ
బందరందు జనుల బంధువైరి (3)
ఆంజనేయ స్వామి ఆలయమ్మును కట్టి
మహతి వేదికగను మలచినారు
హాస్యలహరి సంస్థ హసనాల రాజుగా
నవ్వు రోగములనునణచుననిరి (4)
మహతి వేదికగను మలచినారు
హాస్యలహరి సంస్థ హసనాల రాజుగా
నవ్వు రోగములనునణచుననిరి (4)
సాహితీ సభలన సంభాషణల మేటి
ధారణమ్ములోన ధాటిజూపి
అక్షరాల సృజన అలవోకగాజేసి
పరులు మెచ్చునట్టి పథమునందె (5)
ధారణమ్ములోన ధాటిజూపి
అక్షరాల సృజన అలవోకగాజేసి
పరులు మెచ్చునట్టి పథమునందె (5)
గువ్వలా ఒదిగెను గూడూరు గుండెలో
స్వంతవూరివారు సంతసించ
సద్దుచేయకుండ చాటింపు లేకుండ
వితరణలనుజేయు వినయశీలి (6)
స్వంతవూరివారు సంతసించ
సద్దుచేయకుండ చాటింపు లేకుండ
వితరణలనుజేయు వినయశీలి (6)
వైద్యవృత్తిలోన వైశిష్ఠ్యమును జూపి
సజ్జనుడిగ మసలు సౌమ్యశీలి
కేతనమెగరేయ కేశవకృష్ణుండు
పుత్రవృద్దిగాంచి పొంగినారు (7)
సజ్జనుడిగ మసలు సౌమ్యశీలి
కేతనమెగరేయ కేశవకృష్ణుండు
పుత్రవృద్దిగాంచి పొంగినారు (7)
వంశ వ్యాప్తి కొరకు వసుధను గాలించి
కోరి తెచ్చుకొనిరి కోడలిగను
సహనదేవతంద్రు శైలజమ్మను కూడ
సుదతియామె వాక్కు సుధలు చిలుకు (8)
కోరి తెచ్చుకొనిరి కోడలిగను
సహనదేవతంద్రు శైలజమ్మను కూడ
సుదతియామె వాక్కు సుధలు చిలుకు (8)
శతము దాటిపోయి సంతోషకరముగ
గడపవలయు మీరు ఘనముగాను
రమయె తోడుయైన రమణీయజంటగా
వినయవందనాలు వేలవేలు (9)
***************************
కలం మరియు గళం :గుడిపూడి రాధికారాణి.
15.8.2019.
శ్రీమద్వైఖానస మహామండలి మచిలీపట్నం శాఖ.
గడపవలయు మీరు ఘనముగాను
రమయె తోడుయైన రమణీయజంటగా
వినయవందనాలు వేలవేలు (9)
***************************
కలం మరియు గళం :గుడిపూడి రాధికారాణి.
15.8.2019.
శ్రీమద్వైఖానస మహామండలి మచిలీపట్నం శాఖ.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి