కాళోజీ
********
ఎరుపు సిరా కలముయై
కలములోని రుధిరమై
లక్ష మెదళ్ళ కదలికై
ఎలుగెత్తే గళముయై
గళమెత్తే దళముయై
గాండ్రించిన కవిర కాళోజి.
పలుకుబడుల భాషయై
భాషలోని భావమై
భావమనే ఎరువుయై
తెలుగు అనే తరువునకే
కావ్యమనే ఫలముయై
హృది నిలిచిన కవిర కాళోజి.
కవిత్వమే శ్వాసయై
అక్షరమే బీజమై
సాహిత్యమె లోకమై
చిగురించే ఆశయై
ఆశలోని ఆశయమై
ఎగిసిపడిన కవిర కాళోజి.
అక్షరమే ఆయుధమై
కవిత్వమే ఖడ్గమై
ప్రజాకవిగ పేరుయై
ఉద్యమాల ఉప్పెనయై
నిజాం వ్యతిరేక స్వరముయై
నినదించిన కవిర కాళోజి.
ఖలీల్ జిబ్రాన్ ది ప్రాఫెట్ కు
"జీవన గీత" అనే
తేటతెనుగు సేతయై
"సామాన్యుడే నా దేవుడు"
అనే అసామాన్య ప్రకటనై
పద్మ విభూషణుడైన కవిర కాళోజి.
జనమందరి గొడవను
"నా గొడవ" అంటూ
నెత్తికెత్తుకుని సత్తా చాటి
పలు భాషల పండితుడై
"తుదివిజయం మనది" అంటూ
ప్రతిధ్వనించిన కవిర కాళోజి.
**************************
గుడిపూడి రాధికారాణి,మచిలీపట్నం.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి