7.7.2019) హైదరాబాద్ రవీంద్రభారతి లో ఆవిష్కరింపబడిన "వరకవి సిద్ధప్ప స్మారక కవితా సంకలనం" లో ప్రచురితమైన నా పద్యాలు ..
**కనుమరుగవుతున్న కులవృత్తులు** ( ఆటవెలదులు)
**కనుమరుగవుతున్న కులవృత్తులు** ( ఆటవెలదులు)
ఆ.వె. 1.
పల్లె పదము పాట పాడు ముచ్చటగను
గొర్రె మేక కాయు గొల్ల కురుమ
కర్ర పట్టి నడిపి కాపలా కాసేరు
నేడు కానరారు నెపమెవరిది?
పల్లె పదము పాట పాడు ముచ్చటగను
గొర్రె మేక కాయు గొల్ల కురుమ
కర్ర పట్టి నడిపి కాపలా కాసేరు
నేడు కానరారు నెపమెవరిది?
ఆ.వె.2
బట్టలుతక మరలు-బాదే పనేదిక?
బండనేసి బాది బాది తెచ్చు
రజకులకిక కరువురా బతుకుతెరువు
గాడి దప్ప జనులు గాడిదేడ్చె
బండనేసి బాది బాది తెచ్చు
రజకులకిక కరువురా బతుకుతెరువు
గాడి దప్ప జనులు గాడిదేడ్చె
ఆ.వె.3
గంగిరెద్దు ఆట గారడీ విద్యలు
తోలుబొమ్మలాట తొలగిపోయె
లలితములగు బుట్టలల్లు వారేరిర?
కూలిపనికి మారి కుమిలిపోయె
తోలుబొమ్మలాట తొలగిపోయె
లలితములగు బుట్టలల్లు వారేరిర?
కూలిపనికి మారి కుమిలిపోయె
ఆ.వె.4
మట్టిపాత్రలేవి? మరుగున పడినవి
జనులు ప్లాస్టికనుచు జపము చేయ
కొత్తకుండ నీరు కోరినా దొరకవు
కుములు కాలమొచ్చె కుమ్మరులకు
జనులు ప్లాస్టికనుచు జపము చేయ
కొత్తకుండ నీరు కోరినా దొరకవు
కుములు కాలమొచ్చె కుమ్మరులకు
-------------------------
గుడిపూడి రాధికారాణి
గుడిపూడి రాధికారాణి
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి