11, నవంబర్ 2015, బుధవారం

...................

మా బడిలో 10వ తరగతి చదివే నాగరాజు అనే పిల్లవాడు నరకచతుర్దశి రోజు (నిన్న) చనిపోయాడు.కామెర్లు తిరగబెట్టాయి..పథ్యం సరిగా చెయ్యలేదు అన్నారు.."తులసితీర్ధం నాటిక వేయించా అతను 8వ తరగతి లో ఉండగా.ముగ్గురే పాత్రధారులు.అద్భుతమైన హాస్యం, నీతి గల నాటిక.దినేష్,ఖాదర్ లు భార్యాభర్తలుగా అద్భుతంగా నటించగా "నాగరాజు" పాలేరు నారాయణ  పాత్రలో అత్యద్భుతంగా నటించాడు..45నిమిషాలకు కుదించిన ఆ నాటిక లో సంభాషణలను అలవోకగా నేర్చుకుని తన ధారణతో నన్ను,నటనతో అందరినీ నివ్వెరబోయేలా చేసిన ఈ బాలుడి జీవిత పాత్ర అప్పుడే ముగింపుకు రావడం నాకు........నారాయణా అనగానే ఏంటండీ అని నవ్వుతూ దగ్గరకు వచ్చే నాగరాజు ..అతడి చిట్టిపొట్టి రూపం..నేను ఎప్పటికీ మరువలేను.    

1 కామెంట్‌:

  1. ఒక ఉపాద్యాయురాలుగా మీరు నాగరాజుని ఒక విద్యార్థిగ చూస్తూనే మరొక ప్రక్కన ఒక తల్లికి తన సంతానం మీద వున్న ప్రేమను మీరు చూపిస్తున్నారు. ఇంత తల్లి ప్రేమను మించగల ప్రేమ ఇంకొకతి వుందదు అని నా నమ్మకం. ఒక తల్లిగా మీకు నా పాదాభివందనం

    రిప్లయితొలగించండి