14, ఫిబ్రవరి 2016, ఆదివారం

ప్రేమికుల దినోత్సవం గా చాలా మంది జరుపుకునే ఫిబ్రవరి 14 ని చత్తీస్ ఘడ్ ప్రభుత్వం అమ్మా,నాన్న ల ను పూజించే,స్మరించుకునే రోజు గా జరుపుకోమని ప్రకటించింది. నేను 6వ తరగతి లో చేరిన 2 నెలలకే గుడివాడ పట్టణ స్థాయి లో డిబేట్ పోటీ జరిగింది.నేను చాలా ధైర్యంగానూ, అద్భుతంగానూ పెద్దలు ఉపన్యసించిన స్థాయి లో చెప్పానని ఒకటే పొగిడారు.ఎవరో గొప్పాయన చేత నాకు ప్రధమ బహుమతి ఇప్పిస్తాం.2 రోజులాగి ఆదివారం సాయంత్రం ఒక వేదిక కు రమ్మన్నారు.(గుర్తు లేదు) అది ఇంటి దగ్గరే.ఫ్రెండ్ తో వెళ్ళి తెచ్చుకో.అన్నారు టీచర్స్. నాన్నకు చెప్పా.స్టేట్ బ్యాంక్ లో ఉద్యోగి అయిన నాన్న కు చాలా పని ఉందిట.సరే అన్నారు. కానీ ఆ సమయానికి వచ్చి నన్ను తీసుకువెళ్ళి ఫొటో తీయించారు.నేను బహుమతి అందుకుంటుంటే నాన్న కళ్ళలో ఎంత సంతోషమో. అది మొదలు డిగ్రీ వరకు డిబేట్ అంటే బహుమతి నాదే. ఈ రోజు నేను ఎన్ని ఉపన్యాసాలు,సమీక్షలు చేసినా ఈ చప్పట్లు విన్నప్పుడల్లా నాకు గుర్తొచ్చేది నాన్న మెరిసే కళ్ళే. బిజీ షెడ్యూల్స్ అంటూ పిల్లల్ని నిర్లక్ష్యం చేయకుండా నాన్న తీసుకున్న ఆ చిన్న చర్య నాకు ఎన్ని బహుమతులు,గుర్తింపు,ధైర్యం ,ఆత్మవిశ్వాసం తెచ్చాయో కదా.. నాన్న భౌతికంగా నన్ను వదిలి వెళ్ళినా ఎప్పుడూ నా మనసులో సజీవంగా ఉంటారు.


2 కామెంట్‌లు:

  1. భలే వారండీ మీరు :)

    బ్లాగు టైటిల్ లోనే మొత్తం టపా ని లాగించేస్తారు :)

    టపా శీర్షిక + టపా మేటరు బాగుంది :)

    చీర్స్
    జిలేబి

    రిప్లయితొలగించండి