15, ఆగస్టు 2016, సోమవారం

ప్రశంసలు పొందాను

70వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నాకెంతో ప్రత్యేకమయినవి మిత్రులారా! ఎందువలనంటే కృష్ణాజిల్లా ముఖ్య పట్టణమైన మచిలీపట్నం లోమంత్రివర్యులు శ్రీ దేవినేని ఉమా మహేశ్వర రావు,శ్రీ కొల్లు రవీంద్ర గార్లు, పార్లమెంట్ సభ్యులు శ్రీ కొనకళ్ళ నారాయణ రావు గారు మరియు కలెక్టర్ బాబు ఎ.గార్ల ప్రశంసలు పొందాను. విద్యా శాఖ వారి స్టాల్ లో నేను గణిత నమూనాలు మరి నా రచనలను ప్రదర్శించాను.విద్యా శాఖ-సర్వశిక్షా అభియాన్ వారి శకటం లో డిజిటల్ క్లాస్ నిర్వహించే ఉపాధ్యాయురాలిగా నేను నిలబడే అదృష్టాన్ని పొందాను.విద్యా శాఖ వారి రధమే ప్రధమ బహుమతి కూడా పొందడం ఆనంద దాయకం.
నాకు ఈ అవకాశం ఇచ్చిన విద్యా శాఖ అధికారులు ఎ.ఎం.ఒ.పి.వి.ఎం.రామదాసు గారికి ,ఉపాధ్యాయ మిత్రులు,తెలుగు భాషా సాంస్కృతిక సమాఖ్య సహ కార్యకర్తలు శ్రీ అప్పినేడి పోతు రాజు,యెరపోతు నాగ వెంకట సురేష్ గార్లకు,కె.రఘురాం గారికి సహకరించిన ఇతరులకు హృదయపూర్వక ధన్యవాదాలు.
ఆ చిత్రాలలో కొన్ని మీ కోసం ఆనందంతో....














2 కామెంట్‌లు:

  1. శుభోదయం . అభినందనీయం రాధిక గారు .

    రిప్లయితొలగించండి
  2. పండుగ లన్నిటి యందున
    నిండుగ స్వాతంత్ర్య దినము నిలుచును, ఘనమీ
    పండుగలో పాల్గొనుటలు ,
    కొండాడగ మనసు పుట్టె కూరిమి మెరయన్ .

    రిప్లయితొలగించండి