12, ఆగస్టు 2016, శుక్రవారం

పుష్కరాల తొలిరోజు

మా కుటుంబం పుష్కరాల తొలిరోజు (12.8.2016) పుష్కర స్నాన నిమిత్తం విజయవాడ వెళ్ళాము.ప్రకాశం బ్యారేజ్ కు అతిసమీపంలో గల కృష్ణవేణీ ఘాట్ నందు పుష్కర స్నానమాచరించాము.నీళ్ళు తక్కువగా ఉన్నప్పటికీ సరిపడ

లోతులో చాలినంత ఉండి పిల్లలు కూడా నిర్భయంగా స్నానం చేయుటకు వీలుగా ఉంది.నది నీరు స్వచ్చంగా ఉన్నవి.ఎప్పటికప్పుడు ఒడ్డునే కాక నదిలో వేస్తున్న పదార్ధాలను కూడా పారిశుద్ద్య సిబ్బంది తొలగించివేయడం హర్షణీయం.సమాచార కేంద్రములలో సత్వరమే అడిగిన సమాచారం ఇవ్వబడుచున్నది.తొలిరోజు అంత తక్కువ రద్దీ ని ఊహించలేదు.మహిళల స్నానానంతర దుస్తులు మార్చుకునే గదులు బాగున్నవి.రక్షణ సిబ్బంది,వాలంటీర్లు చక్కని సూచనలతో మైక్ సూచనలిస్తూ సహాయగుణం కనపరుస్తున్నారు.
సిద్దార్ధ కాలేజి నుండి బస్ స్టాండ్,ఘాట్లకు మరియు బస్ స్టాండ్ నుండి రైల్వే స్టేషన్ కు ఉచిత బస్సులు తిరుగుచున్నవి.బస్ స్టాండ్ లో ఉచిత భోజన వసతి,మజ్జిగ ప్యాకెట్లు యాత్రికులందరికీ పంపిణీ జరుగుతోంది.మేము టమాటా రైస్ తిని మజ్జిగ తాగాము.వేడిగా,రుచిగా రైస్ బాగుంది.అనేక కౌంటర్లుగా పెరుగు అన్నం,బిర్యానీ టమాటా బాత్  అల్యూమినియం ఫాయిల్స్ లో అందజేస్తున్నారు. వాటర్ ప్యాకెట్లు బస్ స్టాండ్,రైల్వే స్టేషన్,ఘాట్లు ఇలా అన్నిచోట్లా అందజేస్తున్నారు.
ఇలా  తొలిరోజునే మా పుష్కర స్నానం సంతృప్తిగా సరదాగా ముగిసింది.   

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి