5, ఆగస్టు 2016, శుక్రవారం

నా బంగారు తల్లీ!

నా బంగారు తల్లీ!
నిన్ను చూసి ఆపరేషన్ బాధ మర్చిపోయిన క్షణాన నువ్వో అద్భుతానివి.. 
నీకు పాలిస్తూ నిన్ను లాలిస్తూ మురిసిపోయిన క్షణాన నువ్వో ఆహ్లాదానివి.
పుట్టిన 25వ రోజునే నా కళ్ళలోకి చూస్తూ....ఒక..చిన్న నవ్వు..నవ్విన క్షణాన నువ్వో సంభ్రమానివి.
రెండో ఏటనే నీకు జాబిల్లిని చూపిస్తూ బువ్వ తినిపిస్తుంటే ..
"అమ్మా! అదిగో చూడు.చందమామ మబ్బుల దుప్పటి కప్పుకుంది." అని
నువ్వు పలికిన క్షణాన నువ్వో నమ్మలేని ఆశ్చర్యానివి.
4వఏటనే తప్పుల్లేకుండా తెలుగు చదువుతూ రాస్తుంటే నువ్వో అబ్బురానివి.
తమ్ముడితో అనురాగంతోనే అల్లర్లు పంచే క్షణాన ఒక ఆనందానివి.
సునాయాసంగా ఐ.ఐ.టి. సీట్ తెచ్చుకున్న క్షణాన ఆ వార్త కన్నా నీ మొహంపై వెలిగిన నవ్వే నన్ను వెలిగించిందమ్మా!
నా బంగారు తల్లీ! నీ జీవితం ఆసాంతం తృప్తిగా సాగిపోవాలని ఈ జన్మ దిన సమయాన ఆ దేవదేవుని మనసారా కోరుకోవడం తప్ప మరేమి కానుక ఇవ్వలేని అమ్మను.
శెలవు లేక శారీరకంగా నీ దగ్గర లేకున్నా నా మనసు ఈరోజే కాదు..ఎప్పుడూ నీ దగ్గరే ఉంటుందమ్మా!
నీ క్షేమమే కోరుతుంటుంది.
పుట్టిన రోజు ఆశీస్సులతో...అమ్మ.


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి