8, జనవరి 2017, ఆదివారం

విజయవాడ పుస్తక మహోత్సవంలో 6.1.2017 న ముఖాముఖి కార్యక్రమంలో నేను పాల్గొని నా సాహితీ పురోగతిని అందరితో పంచుకున్నాను.ఎందరో గొప్ప రచయితల తో ఆ వేదికను పంచుకోవడం నాకు చక్కని అనుభూతిని,స్ఫూర్తిని కలిగించింది.ముఖాముఖి ఉద్దేశ్యం కేవలం రచయితలు వారి బయోడేటాని గడగడ చదువుకుపోవడంగా కాక "వారి సాహితీ ప్రస్థాన ప్రేరణను, వారి రచనల ద్వారా నెరవేర్చదలచిన సామాజిక బాధ్యతను, ఆ మార్గంలో వారికెదురైన మెరుపులను,మరకలను,వాటి ద్వారా వర్ధమాన రచయితలు నేర్వవలసిన పాఠాల్ని పంచుకోవడంగా నాకనిపించింది. ఈ మంచి కార్యక్రమంలో నన్ను కూడా భాగస్వామిని చేయడమే కాక సత్కారంతో నన్ను ఆశీర్వదించిన కృష్ణాజిల్లా రచయితల సంఘం అధ్యక్షులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు,డా.జి.వి.పూర్ణ చంద్ లకు, నిర్వాహకులందరికీ, నన్ను గుర్తుపట్టి ఆత్మీయంగా పలకరించిన, పరిచయం చేసుకున్న రచయితలందరికీ నమోవాకములు.



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి