**ఈ రోజు "ఫాదర్స్ డే"సందర్భంగా "బాల్యం లో నా జ్ఞాపకం-4".**
నాన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగి.అప్పుడు మేం ముదినేపల్లి లో ఉన్నాం.నేను 3వ తరగతి లేదా 4వ తరగతి అనేది సరిగ్గా గుర్తులేదు. నా 5వ ఏట నుండే చందమామలు చదవడం అలవాటు చేశారు నాన్న.ఒక రోజు జ్వరంగా ఉందని నేను బడి మానేశా.నాన్న బ్యాంక్ కి వెళ్ళారు.11 గంటల ప్రాంతంలో వచ్చి(అప్పట్లో సైకిలు) నాకో పుస్తకం ఇచ్చారు.ప్రమోద బాలల మాసపత్రిక.కొత్త పత్రిక ఆ రోజు మొదటి సంచిక వచ్చింది.అని చెప్పి మంచినీళ్ళు కూడా వద్దని మళ్ళీ వెళ్ళిపోతుంటే అమ్మ అడిగింది.ఎందుకు అంత పనిలో ఎండలో మీరు రావడం? అటెండర్ కిచ్చి పంపొచ్చుగా.లేదా సాయంత్రం తెస్తే సరిపోయేదిగా. అని.
దానికి నాన్న జవాబు.."దాని మొహం మతాబులా వెలిగిపోతుంది కొత్త పుస్తకం చూస్తే.కళ్ళారా చూద్దాం అని నేనే వచ్చాను.సాయంత్రం వరకు ఎందుకు ఆగడం?ఆపడం?".
అలా సైకిల్ పై తిరిగి బాణం లా వెళ్ళిపోయిన నాన్న ని చూసిన కన్నులతోనే ఆయాసంతో బాధ పడుతూ..2012 లో ఎండదెబ్బకు నా కన్నుల ముందే నన్ను వదిలి వెళ్ళిపోయిన నాన్న ను చూశాను.
"నాన్నా! నేను చేసే ప్రతి రచన లోనూ,నా ప్రతి సాహితీ గెలుపు నాకు అందించిన స్పూర్తి లోనూ నువ్వు నాతో ఉంటావు.ఉన్నావు."

అధ్బుతమైన జ్ఞాపకాలు.
రిప్లయితొలగించండి