21, జూన్ 2016, మంగళవారం

నా సాహితీ పురోగతి.,

చరిత్రపరిశోధకులు,సాహితీమిత్రులు(మచిలీపట్నం శాఖ) అధ్యక్షులు మహమ్మద్ సిలార్ గారు రాసి ఇటీవల ఆవిష్కరించిన "మచిలీపట్నం సర్వస్వం"(ENCYCLOPEDIA OF MACHILIPATNAM) గ్రంధంలో బందరు సంస్కృతి-సాహిత్య రంగం విభాగం లో నా వివరాలకు చోటు లభించింది.
ఉన్న ఊరు కన్నతల్లి వంటిది అంటారు.అలాంటి ఊరి చరిత్రపుటల్లో నా వివరాలు పదిలపరచబడి శాశ్వతం అయ్యాయి అంటే..ఎంత ఆనందంగా ఉందోనండి.అందునా ఆ ఊరు "బందరు." నా ఆనందాన్ని మీతో పంచుకుంటూ సిలార్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.
నా చిటికెడు సాహితీ కృషికి కొండంత ప్రోత్సాహం అందిస్తున్న మీ అందరికీ కూడా నా నమస్సుమాంజలి.
అన్నట్లు ఆ సుదీర్ఘ పుస్తక ప్రూఫ్ దిద్దిన వ్యక్తిగా మీఅందరికంటే ముందు చదివిన భాగ్యం కూడా నాదే సుమా..



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి