14, మార్చి 2016, సోమవారం

బాధగా ఉంది.ఎందుకో బాగా గుర్తొస్తున్నాడు.

నా దగ్గర 4వ తరగతి చదివే బూసం వెంకటేశ్వర రావు అనే పిల్లవాడు ఒక రోజు(తెలుగు పదజాలం,సృజనాత్మకత పెంచే ప్రయత్నం లో భాగంగా మాట్లాడిస్తుంటే..)ఒక కథ చెప్పాడు.బాగుందనిపించి ఇలా కాగితం పై  రూపమిచ్చా..కొంతకాలానికి కృష్ణాతరంగాలు పత్రిక కు పంపగా ప్రచురితమైంది. అప్పటికే నేను పెడన నుండి బంటుమిల్లి మేథ్స్ అసిస్టెంట్  గా ప్రమోషన్ పై వెళ్ళిపోయా.5సంవత్సరాలు దాచిన కథను సమయం చూసి ప్రభుత్వ బాలల మాసపత్రిక ప్రారంభింపబడగానే పంపాను.
నా లెక్క ప్రకారం ఆ పిల్లవాడు 9వ తరగతి కి వచ్చి ఉండాలి.
ఇలా అంచనా వేసుకుని..పుస్తకం తీసుకుని పెడన హైస్కూలు కు వెళ్ళా.
ఆ ముద్దు మాటల పొట్టి బాలుడిని వెతికా.
నన్ను చూసి నా చుట్టూ మూగిన అతడి తోటి నా పూర్వ విద్యార్ధులను అడిగా.
అతడు మరణించాడనే వార్త విని తల్లడిల్లిపోయా.రైలు ప్రమాదమట.
కాళ్ళీడ్చుకుంటూ తిరుగు ప్రయాణమైన నాకు ఆ క్షణం లో ఆ పుస్తకం కొండ రాయి లా చాలా భారంగా తోచింది.
    ఎందుకో ఈ రోజు వాడు బాగా గుర్తొస్తున్నాడు.ఉపశమనం కోసం ఇలా .............
ప్రయాణాలలో సామానే కాదు..మీ బిడ్డలు కూడా జాగ్రత్త.

3 కామెంట్‌లు:

  1. story is good and I am sorry, the boy is no more.....
    ramana vouhini.blogspot.in

    రిప్లయితొలగించండి
  2. అమ్మా! మీ మనసు ఎంత మంచిదో.... బహుసా ప్రతీ తల్లి మనసు కూడా ఇలానే ఉంటుంది. చిరంజీవి. బూసం వెంకటెశ్వరరావు రాసిన కథని ఎలాంటి మర్పులు లెకుండా "కృష్ణా తరంగాలు పత్రికకు, ప్రభుత్వము వారిచె నడపబదుతున్న బాలల మాస పత్రిక"కు పంపి ప్రచురితము అయ్యిన రొజున అతను నిజముగా "చిరంజీవి" గా ఎప్పటికి మీ..మా...మన అందరి మనస్సులొ చిరశ్థాయిగా నిలిచిపొయాడు. కానీ మీరు తనని చూడడానికి పెడన స్కూల్ కి వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి చనిపొయాడు అని తెలిసిన మరు క్షణము మీ తల్లి మనసు పడిన తపన, నరకయాతన ఎవ్వరు వర్ణింపజాలరు. మీ తల్లి హ్రుదయానికి నా పాదాభివందనము. అంతే కాదు, ఇక్కడ మీ కవయిత్రి గా మీ గురించి ఒక్కమాట ఈ పామరుడి నోట... సందు దొరికితె ప్రక్క వారి ఆలొచనలను, భావాలను, భాష్యాలను తనవిగా మరల్చుకునె మనుషులు వున్న ఈ రొజులలొ, వెంకటెస్వరరావు కొసం మీరు వెళ్ళి ఈ కథ నీదిరాకన్నా! అని చెప్పబొయిన మీ కవి హ్రుదయానికి నా మనస్సుమాంజలి................. అమ్మా! మీ తల్లి హ్రుదయానికి కూడా!

    రిప్లయితొలగించండి