15, మార్చి 2016, మంగళవారం

పాప ని బడిలో చేర్చిన మొదటి రోజు.

పాపని 4వ ఏట  ఎల్.కె.జి. లో చేర్చాను.అప్పటికే తనకి తెలుగు వాక్యాలు రాయడం,చదవడం నేర్పేశాను.ఒక్క తప్పు దొర్లేది కాదు.సంతోషంగానే వెళ్ళింది మొదటిరోజు.టీచర్లు కూడా తన ప్రతిభ చూసి ఆనందించినట్లు చెప్పింది.
     కానీ రెండో రోజు కళ్ళలో ఉత్సాహం లేదు.ఏదో తెలియని దిగులు..నేను సహజం గా బడి అంటే ఆ వయస్సులో ఉండే అయిష్టత అనుకుని ఏం అడగలేదు.
   మూడోరోజు కూడా ముభావంగానే గడిచింది.నాలుగోరోజు జలపాతం లా పరవళ్ళు తొక్కుతూ ఎప్పటి హుషారుతో ఇంటికొచ్చింది.హమ్మయ్య అనుకున్నా.
  నేను ఏం అడగాల్సిన అవసరం లేకుండానే వస్తూనే సంతోషంగా చెప్పింది....నేను ఏ మాత్రం ఊహించని కోణం .."అమ్మా! నాకు వాష్ రూం ఎక్కడుందో కనిపించింది.కూ..చుక్..చుక్..ఆటాడించారు.అప్పుడు బడి చుట్టూ తిరుగుతుంటే ఒక చోట కనిపించింది."
    అప్పుడు నవ్వుకున్నా..తర్వాత అనిపించింది.మనం ఎంతో  ఆశిస్తున్నాం.మరి వారి కనీస భయాలను,అవసరాలను గుర్తించగలుగుతున్నామా?? అని.అప్పటి నుండి ఏ కొత్త లోకం తనకి పరిచయం కాబోతున్నా అన్ని కోణాలలో ముందే అవగాహన కల్పించుకుంటున్నా.

1 కామెంట్‌:

  1. పిల్లలకి, అందునా ఆడపిల్లకి తల్లి దగ్గర ఉన్న అనుబంధం ఇంక ఎవ్వరి దగ్గర వుండదు. కొన్ని విషయాలు ఎవ్వరికీ చెప్పుకొలేక బిడియపడుతూ ఉన్నప్పుడు, తనకి కావలసిన సమాచారము తెలిసినప్పుడు తన కళ్ళలో ఈ విశ్వమును జయించిన ఆనందము పొందిన క్షణమున ఏమి జరిగినదో తెలియక మనసు పడిన ఘర్షణకి అలసిపొయిన మీ మనసుకి ప్రశాంతత మీకు దొరికినప్పుడు మీ ఆనందము వర్ణింపలేనిది కదా! ఎమంటావు అమ్మా! ఇది కాదా తల్లి మనసుకి ఊన్న గొప్ప సుగుణము, ఇది కాదా తల్లి మనసుకి మాత్రమే ఉన్న ప్రేమ అనబడే అందమయిన అలంకారము. ఆందుకేనెమో మానవుడిని స్రుస్ఠించిన బ్రహ్మ్మకి కూడా అమ్మ అంటే అంత ఇస్ఠము.

    రిప్లయితొలగించండి