ఆగస్ట్ నెలలో ఒక బాల కార్మికురాలిని పట్టుకుని మా బళ్ళో చేర్చి వెళ్ళారు అధికారులు.6 వ తరగతిలో..మర్నాడే సైన్సు పరీక్ష..భారము అనగానేమి? ఆ ప్రశ్న పత్రం లో ఒక ప్రశ్న..అక్షర దోషాలతో కూడబలుక్కుంటూ ఆ పాప రాసిన జవాబు: "నేను పుట్టి మా అమ్మ,నాన్న కు భారం అయ్యానుట" .. మా అందరి గుండెలు భారం చేసింది ఆ జవాబు..ఎక్కడో కలుక్కుమంది.3 రోజుల ముచ్చటగా తను మళ్ళీ బడి ప్రపంచం నుండి మాయమయ్యింది.కానీ ఈ విషయం నా మనసు పొరల్లో వదిలి వెళ్ళింది.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి