ఉపాధ్యాయ దినోత్సవం అని మా బడి లో పిల్లలు తమ చిట్టి చిట్టి చేతులతో రకరకాల బహుమతులు కొని తీసుకొచ్చారు నాకు ..దాచుకున్న డబ్బులు..ఇలా..బాధ..ఆనందం..ఒక 6వ తరగతి పాప ఒక పెన్ తెచ్చి ఇచ్చింది.ఏదో చెప్పాలని సంశయిస్తోంది.వంగి తన నోరు దగ్గరగా నా చెవిని చేర్చా.."ఏమిటి తల్లీ" అని అడిగా.మెల్లిగా ఆ పాప చెప్పిన జవాబు.."టీచర్..ఈ పెన్ తో ఒక్క కథ రాయరూ.."
నాకెందుకో..కంట తడి..ఆ పాప కు రుణపడిపోయా..అలాంటి బెస్ట్ అవార్డ్ ఇచ్చినందుకు.
నాకెందుకో..కంట తడి..ఆ పాప కు రుణపడిపోయా..అలాంటి బెస్ట్ అవార్డ్ ఇచ్చినందుకు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి